Sridevi Soda Center Review : సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాను పలాస 1978 ఫేమ్ దర్శకుడు కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం ఆగష్ట్ 27న అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
నటీనటులు : లైటింగ్ సూరి బాబుగా సుధీర్ బాబు.
ఆనంది సోదాల శ్రీదేవిగా
పావెల్ నవగీతన్
నరేష్
రఘు బాబు
అజయ్
సత్యం రాజేష్
హర్ష వర్ధన్
టెక్నీకల్ టీమ్ : కరుణ కుమార్ - దర్శకుడు
విజయ్ చిల్లా - నిర్మాత
శశి దేవిరెడ్డి - నిర్మాత
మణి శర్మ- సంగీత దర్శకుడు
శ్రీకర్ ప్రసాద్- ఎడిటింగ్
కథ:
సూరిబాబు (సుధీర్ బాబు) (Sudheer Babu) అమలాపురంలో ఎలక్ట్రీషియన్. అదే ఊళ్లో సోడాల శ్రీదేవి (ఆనంది) (Anandhi) ఉంటుంది. జాతరలో అమ్మాయిని చూసి ఇష్టపడతాడు సూరిబాబు. ఇద్దరూ ప్రేమించుకొంటారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. అదే సమయంలో ఆ ఊళ్లో పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు కాశీ.. శ్రీదేవిని ఇష్టపడతాడు. దానికితోడు సూరిబాబు కులం తక్కువ అంటూ అతనికి దూరం చేయాలి అనుకుంటారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే అనుకోకుండా మర్డర్ కేసులో జైలుకు వెళతాడు సూరిబాబు. ఆ తర్వాత ఏం జరిగింది.. శ్రీదేవి, సూరిబాబు ఒక్కటయ్యారా లేదా అనేది అసలు కథ..
కథనం:
కులం నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అంతెందుకు ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేసిన కరుణ కుమార్ కూడా తన గత సినిమా పలాస 1978 కులం నేపథ్యంలోనే తెరకెక్కించాడు. తాజాగా సుధీర్ బాబుతో మరోసారి అలాంటి ప్రయత్నమే చేశాడు కరుణ. రెగ్యులర్ ప్రేమకథకు క్యాస్ట్ ఫీలింగ్ అంటించాడు. దాన్ని మరింత ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో కొంత వరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు దర్శకుడు కరుణ కుమార్. సినిమా మొదట్లోనే థీమ్ బయట పడిపోవడం.. తక్కువ కులం వాళ్లను మరింత తక్కువగా చూస్తారని చూపించడంతో రాబోయే కథను ఈజీగా ఊహించవచ్చు. ఇలాంటి కథతో సినిమా చేయాలి అంటే స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉండాలి.
ఈ విషయంలో కరుణ కుమార్ ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలు చాలా బలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్లో హీరో తండ్రిపై మరో వ్యక్తి మూత్రం పోయడం లాంటి సన్నివేశాలు బలంగా రాసుకున్నాడు దర్శకుడు. కానీ అదే బలం కథనంలో లోపించింది. ప్రేమకథ ఒకవైపు నడుస్తూనే ఉంటుంది.. మరోవైపు కులం గొడవలు కూడా కనిపిస్తుంటాయి. ఈ రెండింటినీ సరిగ్గా బాలన్స్ చేయడంలో దర్శకుడు ఎక్కడో మిస్ ఫైర్ అయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఓపెనింగ్ సీన్ హీరో జైలుకు రావడం.. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ తో లవ్ ఎపిసోడ్.. ఆ వెంటనే కాస్ట్ గొడవలు అన్ని రొటీన్ గానే అనిపిస్తాయి. చివరి అరగంట మాత్రం ఊహించని విధంగా ఉంది. కులం కోసం ఎంత దూరమైనా వెళ్లే తల్లిదండ్రులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు.. అని సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సీనియర్ నటుడు నరేష్ నరేష్ పాత్రను చాలా టిపికల్ గా రూపొందించాడు దర్శకుడు కరుణ కుమార్. రొటీన్ ప్రేమ కథలా అనిపించే రియలిస్టిక్ డ్రామా శ్రీదేవి సోడా సెంటర్.
రేటింగ్: 2.5/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.