సైరాకు అదే మైనస్... అందుకే ఆడలేదన్న సుదీప్

సైరాకు అదే మైనస్... అందుకే ఆడలేదన్న సుదీప్

చిరంజీవి, సుదీప్

బాలీవుడ్‌లో దబాంగ్ 3 మూవీ నటించిన సుదీప్... ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సైరా ఫెయిల్యూర్‌పై స్పందించాడు.

 • Share this:
  మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సైరా మూవీ తెలుగు ప్రేక్షకులను కొంత మేర ఆకట్టుకున్నా... ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ సాధించలేదు. తెలుగులో ఈ సినిమా పర్వాలేదనిపించినా... బాలీవుడ్‌లో మాత్రం ఈ మూవీ బిగ్ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ మెగాస్టార్ సినిమాలో నటించినా... హిందీ ఆడియెన్స్‌ను అవేమీ ఆకట్టుకోలేకపోయాయి. సైరా సైతం బాహుబలి బాటలోనే బాలీవుడ్ ఆడియెన్స్ ఆదరిస్తారని భావించిన సైరా మేకర్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే అసలు ఈ సినిమా బాలీవుడ్ ఆడియెన్స్‌ను ఎందుకు ఆడలేదనే విషయంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాడు కన్నడ హీరో సుదీప్.

  బాలీవుడ్‌లో దబాంగ్ 3 మూవీ నటించిన సుదీప్... ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సైరా ఫెయిల్యూర్‌పై స్పందించాడు. తన ఉద్దేశ్యం ప్రకారం ఈ సినిమా బాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపాడు. ఈ సినిమా బయోపిక్ కావడం, ఓ ప్రాంతానికి చెందిన స్టోరీ కావడంతో ఉత్తరాది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని సుదీప్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి భారీ సినిమాలు తీసేటప్పుడు ఫిక్షన్ కథలైతేనే బాగుంటుందని... బాహుబలి అందుకే విజయం సాధించిందని సుదీప్ తెలిపాడు. అయితే మేకింగ్ విషయంలో సైరా మూవీ అందరినీ ఆకట్టుకుందని వ్యాఖ్యానించారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు