Samantha | Preetham Jukalker : సమంత‌కు నాకు మధ్య ఉన్న సంబంధం గురించి చైతన్యకు తెలుసు.. ప్రీతమ్ జుకాల్కర్ వ్యాఖ్యలు వైరల్..

Samantha with Preetham Jukalker Photo : Instagram

Samantha | Preetham Jukalker : సమంత, నాగ చైతన్య విడిపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చైతన్య, సమంతలు తమ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

 • Share this:
  సమంత  (Samantha), నాగ చైతన్య విడిపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చైతన్య, సమంతలు తమ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక అది అలా ఉంటే ఏ క్షణమైతే ఆమె నాగచైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారో.. అప్పటి నుంచి ఆమె పట్ల రకరకాల రూమర్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకున్నానని, తాను అవకాశవాదినని ఇలా చాలా రకాలుగా ఆమెను సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. అంతేకాదు కొందరు అబార్షన్లు కూడా చేసుకున్నారని అన్నారు. అయితే ఈ ఆరోపణలపై ఆమె తాజాగా స్పందించారు. తాను ఓ వైపు విడాకుల బాధ నుంచే బయటపడలేకపోతున్న సమయంలో.. తనపై ఇలా చేస్తూ పర్సనల్‌గా అటాక్ చేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు సమంత. ఎవరేమన్నా తనపై ప్రభావం పడదని.. కఠిన సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇక ఈ నోట్‌కు, సమంతకు మద్దతుగా రకుల్ ప్రీత్ రిప్లే ట్వీట్ చేశారు.

  ఇక అది అలా ఉంటే.. సమంతకు ఆమె హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ (Preetham Jukalker) మధ్య ఏదో సంబంధం ఉందన్న ఆరోపణపై తాజాగా జుకాల్కర్ స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై చైతన్య మౌనం తనను కలవరపెడుతోందని అన్నారు. "నేను సమంతను 'జిజి' అని పిలుస్తానని అందరికీ తెలుసు, జిజి అంటే సోదరి అని అర్థం. “నాకు చైతన్య కొన్నేళ్లుగా తెలుసు. సమంతకు, నాకు ఎలాంటి సంబంధం ఉందో అతనికి కూడా తెలుసు. సామ్, నా గురించి అలా వ్యాఖ్యానించవద్దని అతను మాట్లాడి ఉంటే ఇంత రచ్చ ఉండకపోవచ్చని పేర్కోన్నారు. అంతేకాకుండా ఈ రేంజ్‌లో కూడా తప్పుడు పుకార్లు రాకుండా ఉండేవని, నాగ చైతన్య ఈ పుకార్లకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన ఆ ఇంటర్వూలో తెలిపారు.

  Naga Chaitanya : అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... అప్పుడే ఓ ఇంటివాడు కాబోతున్న నాగ చైతన్య...

  ఇక సమంత విడాకుల తర్వాత ముంబైకి షిఫ్ట్ కానుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అదంతా ఏమి లేదని తెలుస్తోంది. ఆమె ముంబైకి వెళ్లట్లేదని తాజా టాక్. సమంత హైదరాబాద్‌లోనే ఉండనుందట. ఆమె తాజాగా గచ్చిబౌళీలో ఖరీదైన ఫ్లాటును కొన్నట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడే ఒంటరిగా నివసించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

  ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

  MAA Elections : ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం.. మా సభ్యత్వానికి రాజీనామా..

  ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

  ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published: