Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారు ఉండరు. తన నటనతో, స్టైల్ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం వరుస సినిమాల అవకాశాలతో దూసుకెళ్తున్నాడు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఫ్యామిలీతో కూడా అంతే సమయాన్ని గడుపుతుంటాడు బన్నీ. ఇక తన ఫ్యామిలీ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు బాగా దగ్గరగా ఉంటుంది.
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ పిల్లల ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ.. ఎంతో మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇక బన్నీ సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబం గురించి ఎంతో ఆలోచిస్తుంటాడు. అలా ఆలోచిస్తూనే కేవలం రోజు సౌకర్యాల కోసమే రూ.350 కోట్లను ఖర్చు పెట్టాడట.
ఇక అల్లు అర్జున్ తన ఇంటి కోసం ఏకంగా వంద కోట్లను ఖర్చు చేసి జూబ్లీహిల్స్ లో లగ్జరీ బంగ్లాను కట్టించుకున్నాడు. బన్నీ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కార్లు ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్క కారు కొన్ని కోట్ల విలువ చేసే కార్లు. ముఖ్యంగా తన కారవాన్ కు రూ.7 కోట్ల పైగా పెట్టాడు. ఇలా కారులకు.. ఇంట్లో సౌకర్యాలకు మాత్రమే కాకుండా ఆయన ధరించే దుస్తులపైన కూడా ఎంతో డబ్బును పోస్తున్నాడు అల్లు అర్జున్. కేవలం ఒక టీ షర్ట్ ధర దాదాపు రూ.65 వేలకు పైగా ఉంటుంది. ఇక ఆయన ధరించే బట్టలు, షూ లు, వాచ్ లు అన్ని ఖరీదైనవే ఉండగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా రోజు సౌకర్యాలకే 350 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టడం అంటే మాములు విషయం కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Allu arjun 350 crore rupees for home, Allu sneha reddy, Icon star allu arjun, Tollywood