తాత అల్లు రామలింగయ్యతో పాత జ్జాపకాలను గుర్తు చేసుకున్న బన్ని..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా ఆయన తన తాతయ్యకు సంబంధించిన పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

news18-telugu
Updated: November 20, 2019, 10:41 AM IST
తాత అల్లు రామలింగయ్యతో పాత జ్జాపకాలను గుర్తు చేసుకున్న బన్ని..
తాత అల్లు రామలింగయ్యతో పాత జ్ఞాపకాలను పంచుకున్న బన్ని (Instagram/Photo)
  • Share this:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతేకాదు తనకు సంబంధించిన సినిమా విశేషాలతో పాటు కుటుంబ విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమాలనుతో పంచుకుంటున్నాడు. తాజాగా అతను హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని పాటలు కానీ అప్‌డేట్స్‌ కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అనే క్యాప్షన్ ఇవ్వాలి. అంతేకాదు పోస్ట్ చేసే ఫోటోలో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..అప్పట్లో తన తాత అల్లు రామలింగయ్యకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డు తీసుకొని అల్లు రామలింగయ్య తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా తాతయ్యకు స్వాగతం పలకడానికి అల్లు అర్జున్.. వాళ్లు కజిన్స్‌తో సహా ఎయిర్ పోర్ట్‌కు వచ్చారు. అప్పుడు తాతకు స్వాగతం పలకడానికి వచ్చినప్పటి ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ చిత్రంతో బిజీ కానున్నాడు. 
Loading...

View this post on Instagram
 

We all went to the airport to receive my grand father when he was honoured with Padma Shri . From Palakol to Padma Shri... what a journey ! #alluramalingaiah #padmashri #memories


A post shared by Allu Arjun (@alluarjunonline) on
First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...