Home /News /movies /

STYLISH STAR ALLU ARJUN REVIEW ON JATHI RATNALU SAYS HAVENT LAUGHUED SO MUCH RECENT YEARS MNJ

Allu Arjun- Jathi Ratnalu: జాతి రత్నాలు మూవీపై బన్నీ రివ్యూ.. హీరో న‌వీన్ పొలిశెట్టిపై కీల‌క వ్యాఖ్య‌లు

అల్లు అర్జున్ జాతి రత్నాలు

అల్లు అర్జున్ జాతి రత్నాలు

Allu Arjun- Jathi Ratnalu: న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు. పిట్టగోడ ఫేమ్ అనుదీప ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్, స్వ‌ప్నా ద‌త్, ప్రియాంక ద‌త్ ఈ మూవీని నిర్మించారు. మార్చి 11న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీకి అన్ని వ‌ర్గాల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...
    Allu Arjun- Jathi Ratnalu: న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు. పిట్టగోడ ఫేమ్ అనుదీప ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్, స్వ‌ప్నా ద‌త్, ప్రియాంక ద‌త్ ఈ మూవీని నిర్మించారు. మార్చి 11న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీకి అన్ని వ‌ర్గాల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ఫుల్ కామెడీ చిత్రం గ‌త కొన్నేళ్లుగా రాలేద‌ని.. థియేట‌ర్ల‌లోకి వెళ్లింది మొద‌లు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత కూడా న‌వ్వు ఆగ‌డం లేద‌ని.. అప్ప‌ట్లో జంధ్యాల గారు తీసిన క్లీన్ అండ్ నీట్ కామెడీని ఈ చిత్రం గుర్తు చేస్తుంద‌ని ప‌లువురు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఈ మూవీ ప్రమోష‌న్ల‌ను బాగా చేయ‌డంతో ప‌లు థియేట‌ర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. మ‌న దేశంలోనే కాదు ఆస్ట్రేలియా, అమెరికాలోనూ జాతి ర‌త్నాల‌కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా యూనిట్ కూడా సంబ‌రాల‌ను జ‌రుపుకుంటోంది.

    ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. దీనిపై త‌న రివ్యూను ఇచ్చారు. ఈ మేర‌కు త‌న సోష‌ల్ మీడియాలో సినిమా గురించి పోస్ట్‌లు వేశారు బ‌న్నీ. అందులో.. రాత్రి జాతి ర‌త్నాలు చూశాను. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. ఒక సినిమాను చూస్తూ ఈ మధ్య కాలంలో ఇంత‌లా న‌వ్వ‌లేదు. న‌వీస్ పొలిశెట్టి నువ్వు నీ న‌టన‌తో అద‌ర‌గొట్టేశావు. ఒక అద్భుత న‌టుడు ఎదుగుతున్నాడు. రాహుల్ నువ్వు చాలా బ్రిలియంట్‌గా చేశావు. ప్రియ‌ద‌ర్శి, ఫ‌రియా అబ్దుల్లా అభినందించద‌గ్గ వాళ్లు. ర‌ధ‌న్ మ్యూజిక్, సాంకేతిక నిపుణుల ప‌నితీరు బావుంది. ఈ క‌థ‌ను న‌మ్మించినందుకు అశ్వ‌నీద‌త్‌, స్వ‌ప్నా సినిమాను, ప్రియాంక ద‌త్, ద‌త్ గారికి నా రెస్పెక్ట్.



    చివ‌రగా అంద‌రినీ ఇంత‌లా ఎంట‌ర్‌టైన్ చేసిన‌ ద‌ర్శ‌కుడు అనుదీప్‌కు నా రెస్పెక్ట్. మీ బ్రెయిన్‌ని స్విచ్ఛాఫ్ చేసి, సినిమాను వెళ్లి ఫ‌న్‌ని పొందండి అని బ‌న్నీ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కి న‌వీన్ పొలిశెట్టి స్పందించారు. థ్యాంక్యు రాక్‌స్టార్ అల్లు అర్జున్ గారు. మీరు సినిమాను ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ ట్వీట్ టైపు చేస్తూ నేను మ‌ర్ఫా డ్యాన్స్ వేస్తున్నా అని న‌వీన్ కామెంట్ పెట్టారు.
    Published by:Manjula S
    First published:

    Tags: Allu Arjun, Jathi Ratnalu, Naveen Polishety

    తదుపరి వార్తలు