• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • STYLISH STAR ALLU ARJUN PUSHPA MOVIE TEASER REVIEW AND ITS POWER PACKED PK

Pushpa movie teaser: అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ 'పుష్ప' టీజర్ రివ్యూ.. తగ్గేదేలే..

Pushpa movie teaser: అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ 'పుష్ప' టీజర్ రివ్యూ.. తగ్గేదేలే..

పుష్ప సినిమా టీజర్ (Pushpa Movie)

Pushpa movie teaser: పుష్ప (Pushpa) టీజర్ చూసిన తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోవడం ఖాయం. ఎందుకంటే ఇందులో యాక్షన్ సీన్స్‌తో పాటు అల్లు అర్జున్ లుక్ అలాగే ఉంది. రంగస్థలం సినిమా సుకుమార్‌లో ఎంత కాన్ఫిడెన్స్ పెంచిందనేది పుష్ప టీజర్ చూస్తుంటే అర్థం అయిపోతుంది.

  • Share this:
అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప సినిమా టీజర్ విడుదలైంది. ఏప్రిల్ 8న పుట్టినరోజు సందర్భంగా దర్శక నిర్మాతలు పుష్పరాజ్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఇప్పుడు విడుదలైన టీజర్‌లో కూడా మొత్తం యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అడవుల్లోనే ఎక్కువ సినిమా చిత్రీకరించాడు దర్శకుడు సుకుమార్. దానికి సంబంధించిన విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమా అంటే దానికి తగ్గట్టుగానే పుష్ప సినిమాను సిద్ధం చేస్తున్నాడు సుకుమార్. గత పుట్టిన రోజుకు ఫస్ట్ లుక్ విడుదల చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన సుకుమార్.. ఈసారి టీజర్‌తో వచ్చాడు. ఇది చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోవడం ఖాయం. ఎందుకంటే ఇందులో యాక్షన్ సీన్స్‌తో పాటు అల్లు అర్జున్ లుక్ కూడా అలాగే ఉంది. రంగస్థలం సినిమా సుకుమార్‌లో ఎంత కాన్ఫిడెన్స్ పెంచిందనేది పుష్ప టీజర్ చూస్తుంటే అర్థం అయిపోతుంది. ఆ మేకింగ్‌లోనే తేడా కనిపిస్తుంది. ప్రతి షాట్ కూడా అద్భుతంగా చిత్రీకరించాడు సుకుమార్.

మరో వైపు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కూడా తనను తాను ఎంత మార్చుకున్నాడు అనేది టీజర్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఎలాంటి సబ్జెక్టుతో అయితే మిగిలిన భాషల్లోకి దండయాత్ర చేయాలో అలాంటి కథతోనే వస్తున్నాడు అల్లు వారసుడు. ఈ టీజర్ చూసిన తర్వాత ఈ పుట్టినరోజుకు బన్నీ ఫాన్స్‌కి ఇంతకంటే బెటర్ గిఫ్ట్ మరొకటి ఉండదు.

పుష్ప సినిమా మొదలైన తర్వాత తొలిసారి రష్మిక మందనను ఈ టీజర్‌లో పరిచయం చేశాడు సుకుమార్. టీజర్ అంతా గంధపు చెక్కల స్మగ్లింగ్ చేయడం.. వాళ్లను పట్టుకోడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ వెంట పడటం.. మధ్యలో వాటిని అల్లు తీసుకెళ్లడంతో చాలా అద్భుతంగా కట్ చేసారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అదిరిపోయింది. టీజర్‌కు పిచ్చెక్కిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఆగస్ట్ 13న ఈ చిత్రం విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published: