విజయ్ దేవరకొండ రౌడీ వేర్ ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్..

Allu Arjun: విజయ్ దేవరకొండ మంచి నటుడు మాత్రమే కాదు.. బిజినెస్ మ్యాన్ కూడా. ఈయన రౌడీ వేర్ అంటూ మొదలుపెట్టి సంచలనం సృష్టించాడు. ఈ క్లోతింగ్ బిజినెస్ రచ్చ చేస్తుంది. దీనికి అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 14, 2020, 6:11 PM IST
విజయ్ దేవరకొండ రౌడీ వేర్ ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్..
రౌడీ డ్రస్ వేసుకున్న అల్లు అయాన్ (allu ayaan rowdy dress)
  • Share this:
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మంచి నటుడు మాత్రమే కాదు.. బిజినెస్ మ్యాన్ కూడా. ఈయన రౌడీ వేర్ అంటూ మొదలుపెట్టి సంచలనం సృష్టించాడు. ఈ క్లోతింగ్ బిజినెస్ రచ్చ చేస్తుంది. ఇక ఇప్పుడు దీనికి అల్లు అర్జున్ (Allu Arjun) ప్రమోట్ చేస్తున్నాడు. అదేంటి విచిత్రంగా అనుకుంటున్నారా..? అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఎందుకు విజయ్ రౌడీ వేర్ ప్రమోట్ చేస్తాడు అనుకుంటున్నారా..? వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరిగింది. అయితే నేరుగా కాకుండా తన కొడుకుతో దీనికి బ్రాండింగ్ చేసాడు బన్నీ. అసలు విషయం ఏంటంటే గీతా ఆర్ట్స్ 2లో తాజాగా చావు కబురు చల్లగా అనే సినిమా ఓపెనింగ్ జరిగింది. కార్తికేయ ఇందులో హీరో.
రౌడీ డ్రస్ వేసుకున్న అల్లు అయాన్ (allu ayaan rowdy dress)
రౌడీ డ్రస్ వేసుకున్న అల్లు అయాన్ (allu ayaan rowdy dress)

ఈ ఓపెనింగ్ సందర్భంగా బన్నీ కొడుకు అయాన్ కూడా వచ్చాడు. అక్కడ ఆ కుర్రాడి సందడి కూడా మామూలుగా లేదు. ఈ మధ్య అల్లు అయాన్ బయట బాగానే కనిపిస్తున్నాడు. అల వైకుంఠపురములో సెట్స్‌లో కూడా చాలా అల్లరి చేసాడు అయాన్. ఇప్పుడు కార్తికేయ సినిమా ఓపెనింగ్‌లో కూడా యాక్షన్ కట్ అంటూ అల్లరి అల్లరి చేసేసాడు ఈ బుడ్డోడు. ఇదిలా ఉంటే ఈ ఓపెనింగ్‌కు బన్నీ కొడుకు వేసుకొచ్చిన డ్రస్ బాగా హైలైట్ అయింది. అందులో మనోడు రౌడీ వేర్ వేసుకొచ్చాడు.

రౌడీ డ్రస్ వేసుకున్న అల్లు అయాన్ (allu ayaan rowdy dress)
రౌడీ డ్రస్ వేసుకున్న అల్లు అయాన్ (allu ayaan rowdy dress)

అల్లు అయాన్ వేసుకున్న రౌడీ చొక్కా బాగా ట్రెండ్ అవుతుందిప్పుడు. తన కొడుక్కి విజయ్ దేవరకొండ బ్రాండ్ దుస్తులు కొనిచ్చాడు అల్లు అర్జున్. ఈ ఒక్క డ్రస్‌‌తో అయాన్‌తో పాటు విజయ్ రౌడీ బ్రాండ్‌కు కూడా మరింత గిరాకీ పెరిగిపోయింది. మొత్తానికి అల్లు అర్జున్‌తో విజయ్ దేవరకొండకు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఇదే కనిపిస్తుంది కూడా. ఏదేమైనా కూడా హీరోగానే కాకుండా రౌడీగా కూడా అభిమానులను బాగానే ఖుషీ చేస్తున్నాడు విజయ్.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు