అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రయాణం.. ముంబైలో ఇంటికి ప్లాన్..

Allu Arjun: ఇప్పటికే హైదరాబాద్‌లో కొత్త ఇంటికి ముహూర్తం పెట్టాడు అల్లు అర్జున్. మరికొన్ని రోజుల్లో ఇక్కడే కొత్తింటికి మారిపోతున్నాడు బన్నీ. మరోవైపు ఆఫీస్ కూడా కట్టించుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఆఫీస్ కార్పోరేట్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 16, 2020, 7:17 AM IST
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రయాణం.. ముంబైలో ఇంటికి ప్లాన్..
అల్లు అర్జున్ (Twitter/allu arjun)
  • Share this:
ఇప్పటికే హైదరాబాద్‌లో కొత్త ఇంటికి ముహూర్తం పెట్టాడు అల్లు అర్జున్. మరికొన్ని రోజుల్లో ఇక్కడే కొత్తింటికి మారిపోతున్నాడు బన్నీ. మరోవైపు ఆఫీస్ కూడా కట్టించుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఆఫీస్ కార్పోరేట్ కంపెనీ స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. వచ్చి పోయే వాళ్ళకు అనువుగా ఉండేలా తన ఆఫీస్ నిర్మించుకుంటున్నాడు బన్నీ. ఇదిలా ఉంటే 'అల.. వైకుంఠపురములో' సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీలో చాలా మార్పులు వచ్చేసాయి. ఈయన ఇప్పుడు ముంబైలో కూడా ఇళ్లు కొనాలని చూస్తున్నాడు. ఇదే విషయాన్ని బన్నీ కన్ఫర్మ్ చేసాడు కూడా. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో బన్నీ ఈ విషయమే చెప్పాడు. తనకు ముంబై నగరం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు బన్నీ.

అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)


ఎప్పుడైనా అక్కడికి వచ్చినపుడు ఉండటానికి తనకు అక్కడ స్టే లేదని.. అందుకే తమ గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే తన సొంతది కాదని చెప్పడం గమనార్హం. అందుకే అక్కడ తెలిసినవాళ్లను కలిసి వెంటనే మళ్లీ తమ గీతా ఆర్ట్స్ ఆఫీస్ వెళ్తుంటానని చెప్పాడు బన్నీ. కానీ అలా కాదని.. ఇప్పుడు అక్కడ కొత్త ఇంటిని కొనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు అల్లు వారబ్బాయి. ఇప్పటికే అక్కడ ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు బన్నీ. వీలైనంత త్వరగా ముంబైలోనూ ఓ ఇంటిని తీసుకోబోతున్నాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురములో విజయంతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
ఈ చిత్రం కోసం తండ్రి నుంచి దాదాపు 25 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. ఉన్నట్లుండి ముంబై ప్లాన్స్ వెనక కూడా ప్లానింగ్ చాలానే ఉంది. చాలా రోజుల నుంచి ఈయన బాలీవుడ్ వెళ్లాలనుకుంటున్నాడు. అయితే సరైన కథ దొరకడం లేదంతే. ఇప్పటికే సౌత్‌లో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇప్పుడు బాలీవుడ్ కూడా వెళ్ళి అక్కడ కూడా సత్తా చూపించాలని చూస్తున్నాడు అల్లు వారబ్బాయి. అందుకే ముంబై ఇల్లు ప్లాన్ కూడా చేసుకుంటున్నాడు ఈయన. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్.
First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు