టాలీవుడ్ సినీ కార్మికుల కోసం అల్లు అర్జున్ విరాళం.. ఎంత ఇచ్చాడంటే..

Allu Arjun | తాజాగా తెలుగు సినీ కార్మికుల కోసం ఉద్దేశించిన కరోనా క్రైసెస్ ఛారిటీ కోసం భారీ విరాళం ప్రకటించారు.

news18-telugu
Updated: March 30, 2020, 4:10 PM IST
టాలీవుడ్ సినీ కార్మికుల కోసం అల్లు అర్జున్ విరాళం.. ఎంత ఇచ్చాడంటే..
అల్లు అర్జున్ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం కరోనా వైరస్ అనేది మన దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ ధాటికి ఎంతో మంది ప్రాణాలు ఒదలుతున్నారు. ఈ వైరస్ తీవ్రతను కట్టడి చేయడానికి ఇప్పటికే కేంద్రం  21 రోజులు దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది పేద  ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నాయి. ఈ కోవలనే పలువురు సినీ నటులు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు.ఈ కోవలో అల్లు అర్జున్ కూడా  తన వంతుగా రూ. కోటి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అది కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళకు ఆర్ధిక సాయం ప్రకటించారు. తాజాగా తెలుగు సినీ కార్మికుల కోసం ఉద్దేశించిన కరోనా క్రైసెస్ ఛారిటీ కోసం రూ.20 లక్షల భారీ విరాళం ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్.. కరోనాపై పోరాటంలో మొత్తంగా రూ.1 కోటి 45 లక్షల విరాళం ప్రకటించారు. త్వరలోనే ఈ మొత్తాన్ని అల్లు అర్జున్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ కార్మికులకు ఇవ్వనున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 30, 2020, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading