Allu Arjun: మేనేజర్ బర్త్ డే పార్టీలో ఛిల్ అయిన అల్లు అర్జున్..

అల్లు అర్జున్ మేనేజర్ శరత్ పుట్టిన రోజు వేడుకలు (Allu Arjun)

Allu Arjun: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో చాలా మంది తమ పర్సనల్ స్టాఫ్‌ను సొంత మనషుల్లా చూసుకుంటారు. తమ కోసం పని చేసే వాళ్లకు చాలా గౌరవం ఇస్తుంటారు.. వాళ్ల కోసం ఏదైనా చేస్తుంటారు. మొన్నటికి మొన్న హీరో ప్రభాస్ కూడా తన జిమ్ ట్రైనర్‌కు..

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో చాలా మంది తమ పర్సనల్ స్టాఫ్‌ను సొంత మనషుల్లా చూసుకుంటారు. తమ కోసం పని చేసే వాళ్లకు చాలా గౌరవం ఇస్తుంటారు.. వాళ్ల కోసం ఏదైనా చేస్తుంటారు. మొన్నటికి మొన్న హీరో ప్రభాస్ కూడా తన జిమ్ ట్రైనర్‌కు కాస్ట్ లీ కార్ గిఫ్టుగా ఇచ్చాడు. ఇందులో అల్లు అర్జున్ కూడా ముందుంటాడు. తన స్టాఫ్‌తో పాటు పిఆర్, మేనేజర్ టీంను కూడా చాలా చక్కగా చూసుకుంటాడనే పేరుంది. ఇదే విషయం ఇండస్ట్రీలో కూడా చెప్తుంటారు. అందుకే బన్నీ పిఆర్ టీం కూడా అంతే బాగా పని చేస్తుంటారు. బన్నీకి సంబంధించిన ఏ విషయం జరిగినా కూడా సోషల్ మీడియాలో అంత ట్రెండింగ్ కావడానికి కారణం కూడా ఆయన కోసం పని చేసే పిఆర్ టీమే. పైగా తను ఈ రోజు ఇంత ఫ్రీగా ఉన్నానంటే కారణం తన టీం అని చెప్తుంటాడు బన్నీ. మొన్న చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ తన పర్సనల్ మేనేజర్ గురించి గొప్పగా చెప్పాడు అల్లు అర్జున్. అతడి పేరు శరత్. తనకు శరత్ ఫ్యామిలీ.. అంతకంటే ఎక్కువ అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. మార్చ్ 16న ఈయన పుట్టిన రోజు సందర్భంగా దగ్గరుండి పార్టీ ఇచ్చాడు బన్నీ. ఆయన బర్త్ డే పార్టీని ఘనంగా జరిపాడు అల్లు అర్జున్. తన పర్సనల్ టీంలో అత్యంత కీలక సభ్యుడు శరత్. అందుకే ఆయనకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు బన్నీ.

ఆ మధ్య తన సినిమా పిఆర్ ఏలూరు శ్రీను పుట్టిన రోజు వేడుకలను బన్నీ దగ్గరుండి సెలబ్రేట్ చేసాడు. ముందు నుంచి కూడా ఏలూరు శ్రీనుతో పాటు ఆయన టీంను కూడా అల్లు అర్జున్ చాలా బాగా చూసుకుంటున్నాడు కూడా. ఎప్పటికప్పుడు తన స్టాఫ్‌తో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు బన్నీ. ఇప్పుడు కూడా మేనేజర్ పుట్టిన రోజు వేడుకలు తన సమక్షంలోనే చేసాడు. గతంలో కూడా తన బాడీగార్డ్ పుట్టిన రోజు వేడుకలను దగ్గరుండి చేయించాడు బన్నీ. మొత్తానికి బన్నీ తీరుకు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: