అల్లు అర్జున్‌కే తప్పలేదు.. సరుకుల కోసం అల సూపర్ మార్కెట్‌లో..

Allu Arjun: తాజాగా అల్లు అర్జున్ ఇంటి కోసం సరుకులు కొనడానికి కామన్ మ్యాన్‌లాగే సూపర్ మార్కెట్‌కు వచ్చాడు. మాస్క్ వేసుకుని.. షార్ట్‌, టీ షర్ట్‌తో వచ్చేసాడు బన్నీ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 9:46 PM IST
అల్లు అర్జున్‌కే తప్పలేదు.. సరుకుల కోసం అల సూపర్ మార్కెట్‌లో..
సూపర్ మార్కెట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun in Super Market)
  • Share this:
కరోనా వైరస్ కారణంగా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. పెద్దోడు పేదోడు అనే తేడా లేకుండా అంతా ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసర వస్తువుల కోసం ఇంటికి కేవలం ఒక్కరు మాత్రమే బయటికి వస్తున్నారు. దాంతో పెద్దిళ్లలో పని చేసే పని మనుషులు కూడా అంతా మానేసి వాళ్ళ వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. దాంతో ఎవరి పనులు వాళ్లే చేసుకోవాల్సి వస్తుందిప్పుడు. తాజాగా అల్లు అర్జున్ కూడా తన ఇంటి కోసం సరుకులు కొనడానికి కామన్ మ్యాన్‌లాగే సూపర్ మార్కెట్‌కు వచ్చాడు. మాస్క్ వేసుకుని.. షార్ట్‌, టీ షర్ట్‌తో బయటికి వచ్చేసాడు బన్నీ.
అల్లు అర్జున్ Photo :  Twitter
అల్లు అర్జున్ Photo : Twitter

ఆయన్ని చూసి కొందరు గుర్తు పట్టారు.. మరికొందరు బన్నీ కాదేమో అని లైట్ తీసుకున్నారు. కానీ తాను మాత్రం తన ఇంటికి చేరువలో ఉన్న సూపర్ మార్కెట్ వెళ్లి తనకు కావాల్సిన సరుకులు తీసుకున్నాడు. అల్లు అర్జున్ అల సూపర్ మార్కెట్‌లో సరుకులు కొంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు పెద్దపెద్ద వాళ్లకే తప్పట్లేదు.. మనమెంత అనుకుంటున్నారు. పెద్దోడికైనా.. పేదోడికైనా అవసరం అవసరం అంతే.

అల్లు అర్జున్ న్యూ లుక్ (Allu Arjun new look)
అల్లు అర్జున్ న్యూ లుక్ (Allu Arjun new look)

బన్నీ ఒక్కడే కాదు.. స్టార్ హీరోలందరూ కూడా తమకు కావాల్సిన సరకులతో పాటు తమ ఇంటి పనులు కూడా స్వయంగా తామే చేసుకుంటున్నారు. వెన్నెల కిషోర్ ఇల్లు ఉడుచుకుంటూ వీడియో పెట్టాడు. జబర్దస్త్ యాంకర్ అనసూయ వంట చేసుకుంటూ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు బన్నీ ఏమో ఇలా సరుకులు కొంటూ ఫోటోకు పోజిచ్చాడు. మొత్తానికి కరోనా వైరస్ కారణంగా అంతా ఇలా ఇంటి పనులతో బిజీ అయిపోయారన్నమాట. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బన్నీ. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలు కానుంది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు