ఓన్లీ వన్స్.. ఫసక్.. బన్నీకి కూతురు స్వీట్ వార్నింగ్..

Allu Arjun fun video with his Daughter : తాజాగా తన కూతురితో కలిసి చేసిన అల్లరిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కూతురు అర్హను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెతో ముద్దు ముద్దుగా మాట్లాడించాడు.

news18-telugu
Updated: August 21, 2019, 9:44 AM IST
ఓన్లీ వన్స్.. ఫసక్.. బన్నీకి కూతురు స్వీట్ వార్నింగ్..
అల్లు అర్జున్,ఆయన కూతురు అర్హ (File Photos)
  • Share this:
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాళీ సమయాల్లో తన పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటారు. తానూ చిన్న పిల్లోడిలా మారి వారితో అల్లరి చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేస్తుంటాడు. తాజాగా తన కూతురితో కలిసి చేసిన అల్లరిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కూతురు అర్హను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెతో ముద్దు ముద్దుగా మాట్లాడించాడు. 'ఓన్లీ వన్స్.. ఫసక్..' అంటూ తన కూతురితో డైలాగ్ చెప్పించాడు. అర్హ కూడా అంతే క్యూట్‌గా 'ఓన్లీ వన్స్.. ఫసక్..' అంటూ బన్నీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. వీరిద్దరి అల్లరిని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, గ్రామీణ యువకుడిగా ద్విపాత్రభినయం చేస్తున్నట్టు టాక్. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>