హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Adipurush: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ‘ఆదిపురుష్’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్..

Prabhas - Adipurush: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ‘ఆదిపురుష్’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్..

ఆదిపురుష్‌లో ప్రభాస్‌ లుక్‌కు సూపర్ రెస్పాన్స్  (Adipurush first look Twitter)

ఆదిపురుష్‌లో ప్రభాస్‌ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ (Adipurush first look Twitter)

Prabhas - Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Prabhas - Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. మోస్ట్ అవేటింగ్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఈ మూవీ నుంచి ప్రభాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బాణాన్ని ఆకాశం వైపు ఎక్కు పెట్టినట్లు ఉందీ పోస్టర్ . సినిమా క్యాప్షన్‌లో రాసినట్లు చెడుపై మంచి విజయాన్ని సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది సినిమాలో అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ పోస్టర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు ఓం రావత్ స్పందిస్తూ...ఈ మ్యాజికల్ జర్నీలో భాగమయ్యేందుకు అక్టోబర్ 2న సాయంత్రం 7.11 నిమిషాలకు అయోధ్యకు వచ్చేయండి అని ఆహ్వానించారు. అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓంరావత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెరపైకి రానుంది.

ఆదిపురుష్ (Adipurush) చిత్రం ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు.

PS-1- Ponniyin Selvan Movie Review: పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ.. మణిరత్నం మార్క్ యావరేజ్ వార్ డ్రామా..

ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో .. వాల్డ్ వైడ్‌గా 20,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు వార్తల వస్తున్నాయి. ఈ రకంగా ‘ఆదిపురుష్’ సినిమా పాన్ ఇండియా లెవల్ దాటిపోయి.. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతుంది.ఈ రకంగా ఆదిపురుష్ (Adipurush) సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేయబోతుంది. తాాజాగా ఈ సినిమాను 3Dతో పాటు డాల్బీ (Dolby)లో విడుదల చేస్తున్నట్టు సమాచారం.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Adipurush movie, Prabhas

ఉత్తమ కథలు