STRONG SENTIMENT THAT MAKES MEGA FANS BELIEVE ON PAWAN KALYAN AND KRISH MOVIE MHN
Pawan Kalyan - PSPK 27: పవన్‌కల్యాణ్, క్రిష్ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ ... మెగా ఫ్యాన్స్ నమ్మకానికి కారణమైన బలమైన సెంటిమెంట్‌పై ఆసక్తికరమైన కథనం
Strong Sentiment That Makes Mega Fans Believe on Pawan Kalyan and Krish movie
Pawan Kalyan - PSPK 27: క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా కాగా.. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌పై మెగా ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకు కారణమైన బలమైన సెంటిమెంట్‌పై ఆసక్తికరమైన కథనం..
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రీ ఎంట్రీలో స్టార్ట్ చేసిన ‘వకీల్‌సాబ్’ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే పవన్‌కల్యాణ్ ఏమాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా చక చకా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు పవన్ రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లిపోయాడు. అందులోఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంటే, మరో చిత్రం సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది(మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ రీమేక్) ఈ రెండు సినిమాలో క్రిష్ సినిమాపై మెగాఫ్యాన్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందుకు కారణం.. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా కాగా.. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌పై మెగా ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఇలా పవన్‌కల్యాణ్ 27వ చిత్రంపై మెగాఫ్యాన్స్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే.. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. ఈయన సంగీత సారథ్యంలో పవన్‌కల్యాణ్ నటిస్తోన్న చిత్రమిది. మెగా కుటుంబానికి, స్వరవాణి కీరవాణికి ఓ అవినాభావ సంబంధం ఉంది. అదేంటంటే.. మెగా హీరోలకు కీరవాణి సంగీతం అందించిన తొలి చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి, కీరవాణి కాంబినేషన్లో రూపొందిన తొలి సినిమా ఘరానా మొగుడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీగా నిలిచిపోయింది.
ఇక మెగా కుటుంబంలో కీరవాణి సంగీతం అందించిన మరో హీరో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. ఈయన కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ వండర్ మగధీర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా చరణ్, కీరవాణి కలిసి చేసిన తొలి సినిమా. ఆ లెక్కలో చూసుకుంటే పవన్‌కల్యాణ్, కీరవాణి కాంబోలో తెరకెక్కుతోన్న క్రిష్ డైరెక్షనల్ మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ అని అభిమానులు అనుకుంటున్నారు. మరి మెగాభిమానుల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి మరి.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.