హోమ్ /వార్తలు /సినిమా /

Nani Ante Sundaraniki Got Crazy Deal: అబ్బో నాని మొదలెట్టలేదు.. కానీ డీల్ పూర్తయ్యింది

Nani Ante Sundaraniki Got Crazy Deal: అబ్బో నాని మొదలెట్టలేదు.. కానీ డీల్ పూర్తయ్యింది

నాని ‘అంటే సుందరానికీ’ (Twitter/Photo)

నాని ‘అంటే సుందరానికీ’ (Twitter/Photo)

Nani - Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న ‘అంటే సుందరానికీ’ సినిమా హక్కులు ఫ్యాన్సీ ఆఫర్‌కు అమ్ముడయ్యాయి.

  నేచుర‌ల్‌స్టార్ నాని కోవిడ్ స‌మ‌యంలో కాస్త గ్యాప్ తీసుకున్నాడేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఎప్ప‌టిలాగానే త‌న స్పీడును చూపించ‌డానికి రెడీ అయిపోయాడు. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌స్తున్న‌నాని.. తాజాగా త‌న 28వ సినిమా ‘అంటే సుంద‌రానికీ..’ చిత్రంలో చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన సమాాచారం ఒకటి సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే సినిమా ఇంకా స్టార్ట్ కాక మునుపే సినిమా బిజినెస్ డీల్ దాదాపు పూర్తయ్యిందని. మైత్రీ మూవీ మేకర్స్ వారికి ప్రారంభం కాకుండానే భారీ లాభాలను తెచ్చిపెడుతున్న సినిమాల్లో ఇదొకటని అందరూ అంటున్నారు. సినిమా ప్రీ బిజినెస్ డీల్స్ అన్ని రకాల హక్కులు కలిపి రూ.52కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ప్ర‌ముఖ డిజిట‌ల్‌, నిర్మాణ సంస్థ జీ .. ఈ సినిమా హ‌క్కుల‌ను ఇంత భారీ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసేశార‌ట‌.

  నిజానికి ఈ ఏడాది నాని 25వ చిత్రం ‘వి’ నేరుగా ఓటీటీలో విడుదలైంది. నిజానికి సినిమాకు అనుకున్నంతగా పాజిటివ్ బజ్ రాలేదు. అలాగే నాని 26వ చిత్రం టక్ జగదీష్ షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ షురూ అవుతుంది. ఈ సినిమా పూర్తి కాక ముందే..అంటే వచ్చే ఏడాది సమ్మర్‌లో నాని త‌న 28వ సినిమా అంటే సుందరానికీ సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసేస్తాడు. ఇంత ప్రాసెస్ జ‌ర‌గాల్సి ఉండ‌గా అప్పుడే ఈ రేంజ్‌లో హ‌క్కులు అమ్ముడు కావ‌డం నానికి మార్కెట్ ప‌రంగా మేలు చేసేదే.

  అసలు నాని సినిమాకు ఇంత‌క క్రేజ్ రావ‌డానికి కార‌ణం.. క్రేజీ కాంబినేష‌న్స్ అని చెప్పాలి. అంటే సుంద‌రానికీ సినిమా ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ చేసిన రెండు సినిమాలు మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రురా సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ హిట్స్‌ను సాధించిన‌వే. ఇక ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో వివేక్ ఆత్రేయ స్టైల్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇలాంటి ద‌ర్శ‌కుడికి నాని వంటి హీరో దొరికితే వ‌చ్చే క్రేజే సినిమాకు ముంద‌స్తు బిజినెస్ పూర్తి కావ‌డానికి తోడ్ప‌డింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నాని జోడీగా న‌జ్రీయా న‌జీమ్ న‌టిస్తుంది. హీరో బ్రాహ్మ‌ణ అబ్బాయి.. హీరోయిన్ క్రిస్టియ‌న్ అమ్మాయి. వీరి మ‌ధ్య ప్రేమ ఎలా పుట్టింది. వీరి అడ్డుగా ఉండే మతాల‌ను ప‌క్క‌న పెట్టి వారెలా ద‌గ్గ‌ర‌య్యార‌నేదే సినిమా కథ అని వార్తలు షికార్లు చేస్తున్నాయి.

  Published by:Anil
  First published:

  Tags: Mythri Movie Makers, Nani, Tollywood Movie News