బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ యాక్ట్ చేస్తోన్న ఓ సినిమా సెట్‌లో కలకలం రేగింది. హృతిక్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ముంబాయిలో జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉగ్రవాదుల పాత్రను పోషిస్తున్నారు. అంతేకాదు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని సూసైడ్ బాంబర్స్ గెటప్ వేసుకున్నారు. ఆ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ కాస్త పెండింగ్‌లో ఉంది. ఈ గ్యాప్‌లోనే సదరు జూనియర్ ఆర్టిస్టులు అవే కాస్ట్యూమ్స్‌తో పక్కనే ఉన్న ఓ షాప్‌కు వెళ్లారు. వారిని చూసి స్థానికులు ఉగ్రవాదులనుకొని భయపడ్డారు. వెంటనే అక్కడున్న కొంత మంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు హుటాహుటిని ఆ ఘటనాస్థలికి చేరుకొని ఆ ఇద్దరినీ అదుపులోని తీసుకున్నారు. తాము జూనియర్ ఆర్టిస్టులని.. కాస్త గ్యాప్ దొరకడంతో అదే గెటప్‌తో బయటకు వచ్చామన్నారు. ఐనా పోలీసులు ససేమిరా అంటూ వాళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం నిర్మాతల దృష్టికి రావడంతో వారు సదరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. వారు జూనియర్ ఆర్టిస్టులని ఆధారాలు చూపించిన తర్వాతే పోలీసులు వారిని ఒదిలేశారు. ఈ సంఘటనతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సినిమాలో హృతిక్‌తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. సిద్దార్ధ్ ఆనంద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Hrithik Roshan, Tiger shroff