Home /News /movies /

STORY BEHIND VENKATESWARA SWAMY ROLE IN ANNAMAYYA MOVIE MHN

Nagarjuna - Raghavendra Rao: నాగార్జున ‘అన్నమయ్య’లో వెంకటేశ్వర స్వామిగా నటించాల్సింది ఎవరో తెలుసా..?

నాగార్జున ‘అన్నమయ్య’

నాగార్జున ‘అన్నమయ్య’

Nagarjuna - Raghavendra Rao - Annamayya Movie: నాగార్జున ‘అన్నమయ్య’ చిత్రాన్ని తెరకెక్కించిన కె.రాఘవేంద్రరావు ముందుగా వెంకటేశ్వరస్వామి పాత్రలో ఇద్దరు హీరోలను నటింప చేయాలని అనుకున్నాడట. కానీ తీరా ఏమైందో తెలుసా...

    టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుల్లో ఒకడైన నాగార్జున అక్కినేని భక్తి చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘ఓంనమోవేంకటేశాయ’, ‘శిరిడీసాయి’ చిత్రాల్లో నాగార్జున నటించారు. ఇందులో ‘శిరిడీసాయి’లో మాత్రమే నాగార్జున సాయిబాబాగా నటించారు. మిగిలిన చిత్రాల్లో భక్తుడిగా మెప్పించారు. అప్పటి వరకు నాగార్జున అంటే లవ్ సినిమాలు, కమర్షియల్ సినిమాల హీరో మాత్రమే. కానీ ‘అన్నమయ్య’తో రాఘవేంద్రరావు నాగార్జున ఇమేజ్ మార్చేశారు. ఏడుకొండ‌ల‌వాడు వెంక‌టేశ్వ‌ర‌స్వామి కీర్త‌న‌లు రాసిన ప‌ర‌మ భ‌క్తుడు అన్న‌మ‌య్య‌గా నాగార్జున న‌టిస్తాడ‌ని ప్ర‌క‌టించిన‌ప్పుడు చాలా మంది నాగార్జున.. భ‌క్తి చిత్రంలో న‌టిస్తున్నాడా? అని అనుకున్నారు. అయితే ఎప్పుడూ కొత్త త‌ర‌హా చిత్రాలు చేయాల‌నుకునే నాగార్జున ఆ విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకుండా రాఘ‌వేంద్ర‌రావుపై న‌మ్మ‌కంతో ‘అన్నమయ్య’ సినిమా చేశారు. 1997లో విడుద‌లైన ఈ సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నాగార్జున కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోయింది.

    ‘అన్నమయ్య’ విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి చోటు చేసుకుంది. అదేంటంటే.. ‘అన్నమయ్య’సినిమా అనుకున్న‌ప్పుడు భ‌క్తుడిగా టైటిల్ పాత్రలో నాగార్జున న‌టిస్తాడు స‌రే! మ‌రి ఏడుకొండలవాడు..వెంక‌టేశ్వ‌ర‌స్వామిగా ఎవ‌రు న‌టిస్తారు? అనే సందేహం వ‌చ్చింది. సినిమాలో కొన్ని స‌న్నివేశాల్లో భ‌క్తుడైనా నాగార్జున.. వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌ధారి పాదాల‌పై ప‌డాల్సిన స‌న్నివేశాలున్నాయి. అక్కినేని అభిమానుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా మంచి స్ట్రేచ‌ర్ ఉన్న ఆర్టిస్టుని వెంక‌టేశ్వ‌రునిగా న‌టింప చేస్తే బావుంటుంద‌ని భావించిన ద‌ర్శ‌కేంద్రుడు ముందుగా సీనియ‌ర్ న‌టుడు శోభ‌న్‌బాబుని క‌లిశారు. అయితే అప్ప‌టికే శోభ‌న్‌బాబు సినిమాల నుండి రిటైర్ అయిపోయారు. అయితే అన్న‌మ‌య్య‌గా చేస్తుంది నాగేశ్వ‌ర‌రావు కొడుకు.. మ‌రోవైను ద‌ర్శ‌కేంద్రుడు ఎలా చేయాలా? అని ఆలోచించిన శోభ‌న్‌బాబు యాబై ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తే చేస్తాన‌ని చెప్పాడ‌ట‌. ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అడిగితే వెన‌క్కి వెళ్లిపోతార‌నేది శోభ‌న్‌బాబు ఆలోచన‌. అప్ప‌ట్లో యాబై ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ అంటే ఎక్కువే మ‌రి దీంతో ద‌ర్శక నిర్మాత‌లు శోభ‌న్‌బాబుని వ‌ద్ద‌నుకున్నారు.

    త‌ర్వాత రాఘ‌వేంద్రరావు బాల‌కృష్ణ‌ను వెంక‌టేశ్వ‌ర స్వామిగా న‌టింప‌చేస్తే ఎలా ఉంటుందా? అని కూడా ఆలోచించారట‌. అయితే, ఎక్క‌డ ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు అవుతాయేమోన‌ని భావించి వ‌ద్ద‌నుకున్నారు. చివ‌ర‌కు తెగ ఆలోచించిన త‌ర్వాత సుమ‌న్ గుర్తుకువ‌చ్చాడు. సుమ‌న్ సీనియ‌ర్ యాక్ట‌ర్‌.. కావ‌డంతో ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని రాఘ‌వేంద్రరావు భావించ‌డంతో అప్పుడు సుమన్‌ని పిలిపించి ఫొటో షూట్ చేయించారు. ఆయనకు గెటప్ చక్కగా సూట్ కావడంతో చివరకు సుమన్ వెంకటేశ్వరుడి పాత్రధారిగా నటించి అందరినీ మెప్పించారు. ‘అన్నమయ్య’ సినిమాలో వెంకటేశ్వరుడి పాత్రధారి వెనుక నడిచిన అసలు కథ అదన్నమాట..
    Published by:Anil
    First published:

    Tags: Bala Krishna Nandamuri, K. Raghavendra Rao, Nagarjuna, Nagarjuna Akkineni, Suman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు