Ram Charan Rangasthalam: సినిమాలలో కథ ఒక్కటే కాదు అందులో కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో తంటాలు పడుతుంటారు దర్శకులు. దర్శకులు కేవలం ఆ సీన్ గురించి వివరించడం తప్ప చూపించేది ఏమీ ఉండదు. కానీ చేసేది మొత్తం నటీనటులే. అది ఫైట్ సీన్ అయినా, రొమాంటిక్ సీన్ అయినా ఏదేమైనా నటీనటులే చేయాలి. కొన్ని కొన్ని సార్లు రొమాంటిక్ సీన్ లలో హీరో హీరోయిన్స్ నటించడానికి ఇబ్బందిపడుతుంటారు. మరికొందరు సులువుగా చేసేస్తారు. కానీ చరణ్, సమంతల రొమాంటిక్ సీన్ మధ్య పెద్ద కథే నడిచింది.
సుకుమార్ దర్శకత్వంలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ తో సక్సెస్ పొందిన సినిమా రంగస్థలం. ఈ సినిమాలో రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ పరంగా మంచి సక్సెస్ ను అందించింది. ఇందులో సమంత, రామ్ చరణ్ ల మధ్య జరిగిన ముద్దు సీన్ ఎంత హైలెట్ గా మారిందో చూశాం. ఇక లిప్ లాక్ గురించి రామ్ చరణ్ బాగా తంటాలు పడ్డాడని తెలిసింది.
రామ్ చరణ్ కు సుకుమార్ ఈ కథ చెప్పినప్పుడే ఇందులో ఉండే ముద్దు సీను గురించి కూడా వివరించాడట. కానీ రామ్ చరణ్ మాత్రం ఈ సీన్ కు అసలు ఒప్పుకోలేదట. పైగా అప్పటికే రామ్ చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకోగా.. ఉపాసనకు లిప్ లాక్ సీన్లు నచ్చవని..ఇలాంటి సీన్స్ పెట్టవద్దని చెప్పేశాడట చరణ్. ఇక సుకుమార్ కూడా చరణ్ రిక్వెస్ట్ కు ఓకే అన్నాడట. కానీ ఈ సినిమాలో ఈ సీన్ అనేది ముఖ్యమైనది అంటూ.. ఎలాగైనా ఈ సీన్ ను పెట్టాలి అని మళ్లీ రామ్ చరణ్ ను ఒప్పించాలి అని అనుకున్నాడట సుకుమార్.
కానీ రామ్ చరణ్ మాత్రం ఈ సీన్ వద్దు అన్నాను కదా అంటూ నేరుగా చెప్పాడట. ఇక సుకుమార్ ఈ సీన్ వదిలేది లేదు అనుకొని.. ఈ సీన్ చిత్రీకరించే రోజున సమంతతో రామ్ చరణ్ కి లిప్ లాక్ పెట్టమని తెలిపాడట. అంతేకాకుండా చరణ్ కి మాత్రం పెదాలు దగ్గరికి వస్తాయని మిగతాది మొత్తం గ్రాఫిక్స్ ద్వారా చీట్ చేయవచ్చు అని చెప్పాడట. ఇక షూట్ రెడీ కాగానే సమంత నేరుగా లిప్ లాక్ ఇచ్చిందట. దీంతో చరణ్ షాక్ అవుతూ సుకుమార్ పై మండిపడ్డాడని తెలిసింది. ఇక తర్వాత సుకుమార్ చరణ్ కు నచ్చజెప్పి ఈ సీన్ ను సినిమాలో ఉండేటట్లు చేశాడట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Charan, Ram charan samantha akkineni liplock, Rangasthalam, Samantha akkineni, Tollywood