తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్‌గా మారారు.ఇప్పటికే రామారావు తనయుడు బాలకృష్ణ..తన తండ్రి జీవితకథపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలు రెండు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ నిలిచాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీతో మైలేజీ తెచ్చకుందామనుకున్న టీడీపీ శ్రేణులకు ఎన్టీఆర్ మూవీ డిజాస్టర్‌గా నిలవడాన్ని అన్నగారి అభిమానులతో పాటు తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవాలను వక్రీకరించడం వల్లే ఈ బయోపిక్ లు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయని, అందుకే ప్రజలు వాటిని తిరస్కరించారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. మరోవైపు సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్‌తో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ తెరకెక్కించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యుల సహకారంతో ఎలా వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్నిఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ చూపెట్టనున్నారు. ఈ సినిమాను ముఖ్యంగా చంద్రబాబును నెగిటివ్‌గా చూపించనున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన దేవీబాబు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ఫిర్యాదు చేశారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏక పక్షంగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తెరకెక్కించడం..ఆ సినిమా విడులైతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని సదరు ఫిర్యాదు దారు కోరారు.
దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల సంఘం ఈసినిమా చూసి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మరి తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై ఎలాంటి నిర్ణయంతీసుకుంటుందో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, AP Politics, Chandrababu Naidu, Election Commission of India, Lakshmi Parvathi, Lakshmis NTR, NTR, NTR Biopic, NTR Mahanayakudu, Ram Gopal Varma, RGV, TDP, Telugu Cinema, Tollywood