బాల్ థాక‌రేతో పెట్టుకున్న సిద్ధార్థ్.. ద్వేషాన్ని అమ్ముకోవ‌డం మానండంటూ ఫైర్..

హీరో సిదార్థ్ చూడడానికి చాక్లెట్ బాయ్‌లా ఉంటాడు. కానీ ఆయన చేసే పనులు మాత్రం చాలా డేరింగ్‌గా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ ఒకటి చేసాడు సిద్దూ. ‘థాక‌రే’ సినిమా ట్రైలర్‌పై ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ముందు ద్వేషాన్ని అమ్ముకోవడం మానేస్తే.. దేశం బాగుపడుతుందని చెప్పాడు ఈ హీరో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 27, 2018, 5:49 PM IST
బాల్ థాక‌రేతో పెట్టుకున్న సిద్ధార్థ్.. ద్వేషాన్ని అమ్ముకోవ‌డం మానండంటూ ఫైర్..
బాల్ థాకరే సిద్ధార్థ్
  • Share this:
హీరో సిదార్థ్ చూడడానికి చాక్లెట్ బాయ్‌లా ఉంటాడు. కానీ ఆయన చేసే పనులు మాత్రం చాలా డేరింగ్‌గా ఉంటాయి. ఒక‌ప్పుడు ‘బొమ్మ‌రిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సినిమాల‌తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయ‌న‌. ఈయ‌న‌కు సినిమాల‌తో పాటు బ‌య‌టి విష‌యాల‌పై కూడా ధ్యాస ఎక్కువే. ఇప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ ఒకటి చేసాడు సిద్దూ. ఈయ‌న‌ ఏదైనా విషయం గురించి మాట్లాడితే చాలా సూటిగా ఉంటాయి. ఇప్పుడు కూడా మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు సిద్ధార్థ్.

'Stop Selling Hate': Siddharth Sensational comments on Nawazuddin Siddiqui's Thackeray.. హీరో సిదార్థ్ చూడడానికి చాక్లెట్ బాయ్‌లా ఉంటాడు. కానీ ఆయన చేసే పనులు మాత్రం చాలా డేరింగ్‌గా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ ఒకటి చేసాడు సిద్దూ. ‘థాక‌రే’ సినిమా ట్రైలర్‌పై ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ముందు ద్వేషాన్ని అమ్ముకోవడం మానేస్తే.. దేశం బాగుపడుతుందని చెప్పాడు ఈ హీరో. Siddharth Sensational comments on Nawazuddin Siddiqui's Thackeray,Thackeray movie trailer,Thackeray movie siddharth,Thackeray movie,Nawazuddin Siddiqui's Thackeray,Nawazuddin Siddiqui siddharth,Siddharth Thackeray movie,hindi cinema,bal thakeray,బాల్ థాకరే,బాల్ థాకరే సిద్ధార్థ్,సిద్ధార్థ్ థాకరే ట్రైలర్,నవాజుద్ధీన్ సిద్ధిఖీ సిద్ధార్థ్,థాకరే ట్రైలర్‌పై సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు,తెలుగు సినిమా,హిందీ సినిమా
బాల్ థాకరే సినిమా పోస్టర్


‘థాక‌రే’ సినిమా ట్రైలర్‌పై ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. శివసేన స్థాపకుడు బాల్ థాకరే బయోపిక్‌గా ఈ చిత్రం వస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సంచలనం సృష్టిస్తుంది. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి ఇందులో థాకరే పాత్రలో నటిస్తున్నాడు. ఈ ట్రైలర్‌లో ఉన్న కొన్ని డైలాగ్స్ సెన్సార్‌కు సైతం షాక్ ఇచ్చాయి. ఉఠావో లుంగీ.. బ‌జావో పుంగీ.. లాంటి డైలాగ్స్ పెట్టి జనానికి మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండంటూ ఫైర్ అయ్యాడు సిద్ధూ. అక్కడితో ఆగకుండా సినిమాలో ఉన్న ఇంకో రెండు మూడు డైలాగ్స్‌ను హైలెట్ చేస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసాడు.


Loading...
ముందు ద్వేషాన్ని అమ్ముకోవడం మానేస్తే.. దేశం బాగుపడుతుందని చెప్పాడు ఈ హీరో. కేవలం డబ్బుల కోసం ఇలాంటి డైలాగ్స్ పెట్టి ప్రజల్లో లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టద్దని కోరుకున్నాడు సిద్ధూ. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ కామెంట్స్‌కు బాగానే సపోర్ట్ వస్తుంది. ఆయన అడిగిన దానిలో నిజం కూడా ఉంది కదా అని అందరూ ఈ తమిళ హీరోకి సపోర్ట్ చేస్తున్నారు. ‘థాకరే’ ట్రైలర్ చూసిన తర్వాత హేట్ స్పీచ్ అంటూ ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. ఈ చిత్రానికి శివసేన లీడర్ సంజయ్ రౌత్ స్క్రిప్ట్ అందించాడు. ఆయనే నిర్మాత కూడా.అభిజిత్ ప‌న్సే తెర‌కెక్కిస్తున్నాడు ఈ చిత్రాన్ని. జనవరి 23న విడుదల కానుంది ఈ చిత్రం. దక్షిణ భారతదేశ ప్రజలపై 1960వ ద‌శ‌కంలో ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాడు బాల్ థాకరే. మహారాష్ట్ర యువత ఉద్యోగాలను దక్షిణాది ప్రజలు దొంగిలిస్తున్నారంటూ ఉద్యమం చేశాడు. చివరి వరకు నియంతగానే ఉన్నాడనే వాద‌న కూడా ఉంది. దాంతో ఈయన బయోపిక్ అనగానే లేనిపోని వివాదాలు వస్తున్నాయి.ఇప్పుడు కూడా ‘థాకరే’ ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఇదే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇకిప్పుడు సిద్ధార్థ్ లాంటి హీరోలు దీనిపై స్పందించే స‌రికి పరిస్థితి మరింత సీరియస్ అయింది. మరి విడుదలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే.. రేపు సినిమా విడుదలయ్యాక‌ ఎన్ని సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుందో చూడాలి.

రాశీఖన్నా లేటెస్ట్ ఫోటోస్..


ఇవి కూడా చదవండి..

ఆంటీ తెచ్చిన తంటా.. జాన్వీ క‌పూర్‌పై స్మృతి ఇరానీ ఫైర్..


జోరుగా ‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు...


రెండు వారాల్లో మూడు సినిమాల‌తో వ‌స్తున్న రామ్ చ‌ర‌ణ్..

First published: December 27, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...