STILL POLICE NOT GIVEN PERMISSION FOR RRR PREMIERE SHOWS IN HYDERABAD AND HERE THE TICKET PRICE DETAILS PK
RRR premiere show in Hyderabad: హైదరాబాద్‌లో ‘ట్రిపుల్ ఆర్’ ప్రీమియర్ ఎప్పుడు.. ఎక్కడ.. టికెట్ ఎంత..?
RRR Photo : Twitter
RRR premiere show in Hyderabad: ‘RRR’ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి మూడు రోజులు టికెట్స్ అమ్ముడైన విధానమే చెప్తుంది మనకు. అసలు ఒక్క టికెట్ కూడా చూద్దామంటే కూడా దొరకడం లేదు. టికెట్ బంగారమాయనే అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి.
‘RRR’ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి మూడు రోజులు టికెట్స్ అమ్ముడైన విధానమే చెప్తుంది మనకు. అసలు ఒక్క టికెట్ కూడా చూద్దామంటే కూడా దొరకడం లేదు. టికెట్ బంగారమాయనే అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. అయితే సినిమాను అందరిలా ఉదయం ఆటకు చూడాలనుకునే అభిమానులు కొందరున్నా.. అందరి కంటే ముందుగానే చూడాలని కోరుకునే ఆడియన్స్ మరికొందరు ఉంటారు. వాళ్ల కోసమే ప్రీమియర్స్ వేస్తుంటారు. ఇప్పుడు కూడా ట్రిపుల్ ఆర్ (RRR) విషయంలో ఈ ప్రీమియర్స్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ సినిమా కోసం ఇటు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. 2020 నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు 2022లో వస్తుంది. దాంతో వాళ్ల ఎగ్జైట్మెంట్కు అవధుల్లేకుండా పోయాయి.
మార్చ్ 25న ఏకంగా 10 వేల థియేటర్స్‌లో వచ్చేస్తుంది ట్రిపుల్ ఆర్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రీమియర్స్ ఉన్నాయా లేవా అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కేవలం హిందీలోనే 3500 స్క్రీన్స్‌లో వస్తుంది ట్రిపుల్ ఆర్. అక్కడ 92 కోట్లకు ఈ సినిమాను అమ్మేసారు. మరోవైపు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా రికార్డు స్క్రీన్స్‌లో విడుదలవుతుంది ఈ చిత్రం. ఈ సినిమాపై ఉన్న అంచనాలను క్యాష్ చేసుకోడానికి.. ముందు రోజే ప్రీమియర్స్ వేయడానికి చూస్తున్నారు మేకర్స్. ఈ మేరకు చాలా వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. పైగా తెలంగాణలో ఉదయం 6 గంటలకే షోలు మొదలు కానున్నాయి. ఇక్కడ 5 షోలు వేసుకోడానికి అనుమతులు ఉన్నాయి.
మరోవైపు ఏపీలోనూ అర్ధరాత్రి నుంచే షోలు వేస్తున్నారు. అక్కడ ముందు రోజు రాత్రి కానీ.. లేదంటే అర్ధరాత్రి 12 గంటల తర్వాత కానీ ప్రీమియర్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ప్రీమియర్స్ కోసం పోలీస్ పర్మిషన్స్ మాత్రం ఇంకా రాలేదు. దాంతో ఈ విషయంలో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. హైదరాబాద్‌లో ట్రిపుల్ ఆర్ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయా లేవా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. కచ్చితంగా విడుదలకు ముందు రోజు వరకు ఈ క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు.
కచ్చితంగా మార్చ్ 24 అర్ధరాత్రి నుంచే ప్రీమియర్స్ సందడి కనిపించడం ఖాయం అయిపోయింది. అందులోనూ కూకట్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని 11 థియేటర్స్‌లో భారీగా ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. వాటి కోసం ఏకంగా 2 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగు సినిమాల్లో ఇది హైయ్యస్ట్ రేట్. పైగా ప్రీమియర్స్ కోసం ఒక్కో టికెట్ ధర కూడా 3500 వరకు ఉండబోతుంది. పోలీస్ పర్మిషన్స్ వస్తే అన్నింటికి క్లియరెన్స్ వచ్చినట్లే. ఎలాగూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ట్రిపుల్ ఆర్ సినిమాకు అన్ని విధాలా సాయం చేస్తున్నాయి. దాంతో కచ్చితంగా అనుమతులు వస్తాయని నమ్ముతున్నారు ఫ్యాన్స్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.