కళ్లు చెదిరే కలెక్షన్స్.. కార్తీ ఖైదీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Karthi Kaithi Collections : దీపావళి పండుగకు స్టార్ హీరో విజయ్ బిగిల్‌తో పోటీగా.. ఏమాత్రం అంచనాల్లేకుండా ఖైదీ విడుదలైంది. అయితే మొదటిరోజు నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగాయి.

news18-telugu
Updated: November 8, 2019, 4:34 PM IST
కళ్లు చెదిరే కలెక్షన్స్.. కార్తీ ఖైదీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
Karthi Kaithi Collections : దీపావళి పండుగకు స్టార్ హీరో విజయ్ బిగిల్‌తో పోటీగా.. ఏమాత్రం అంచనాల్లేకుండా ఖైదీ విడుదలైంది. అయితే మొదటిరోజు నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగాయి.
  • Share this:
కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ హౌజ్‌ఫుల్ కలెక్షన్లు రాబడుతోంది.ట్రేడ్ పండితులు చెబుతున్న ప్రకారం.. ఖైదీ సినిమా ఇప్పటివరకు రూ.80కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఓవర్‌సీస్‌లో మరో రూ.10కోట్లు వరకు రాబట్టింది. సినిమా మొదటి రోజు రూ.3.5కోట్లు వసూళ్లు రాబట్టగా.. మూడో రోజు నుంచి వరుసగా వసూళ్లు పెరుగుతూ పోయాయి.ఒక్క తమిళనాడులోనే మొదటివారంలో రూ.25కోట్లు గ్రాస్ రాబట్టింది. కేరళ,ఆంధ్రప్రదేశ్‌లలోనూ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇదే ఊపు కొనసాగితే కార్తీ సినిమా రూ.100కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం.

దీపావళి పండుగకు స్టార్ హీరో విజయ్ బిగిల్‌తో పోటీగా.. ఏమాత్రం అంచనాల్లేకుండా ఖైదీ విడుదలైంది. అయితే మొదటిరోజు నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగాయి. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఖైదీని అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా మలచడంలో లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యాడు. దీంతో సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

First published: November 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...