Vaishnav Tej next Movie: ప్రముఖ బ్యానర్ వైష్ణవ్ తేజ్‌ను లాక్ చేసింది... మెగా కుర్ర హీరో మూడో సినిమా ఫిక్స్

Star production house doing movie with Vaishnav Tej

Vaishnav Tej next Movie: రీసెంట్‌గా విడుదలైన ఉప్పెన చిత్రం సాధించిన సెన్సేషనల్ సక్సెస్‌తో వైష్ణవ్ తేజ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వైష్ణవ్ తేజ్‌తో సినిమా చేయనుంది

  • Share this:
    ఇప్ప‌టికే క్రికెట్ టీమ్ త‌ర‌హాలో డ‌జ‌ను మంది హీరోలున్న మెగా క్యాంప్ నుంచి రీసెంట్‌గా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఉప్పెన సినిమాతో అడుగు పెట్టిన హీరో వైష్ణ‌వ్ తేజ్‌. తొలి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేసి వైష్ణ‌వ్ తేజ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. సినిమా ఇప్ప‌టికే ముప్పై కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఏ డెబ్యూ హీరో సినిమాకు రాని క‌లెక్ష‌న్స్ ఇవి. అయితే వైష్ణ‌వ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన విడుద‌ల కాక ముందే మ‌రో సినిమాలో న‌టించేశాడు.

    డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో క‌లిసి వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. ఈ సినిమా విడుద‌ల కాక ముందే ఉప్పెన విడుద‌ల కావ‌డం, సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో వైష్ణ‌వ్‌తేజ్‌కు స్టార్ ఇమేజ్ వ‌చ్చేసింది.

    దీంతో టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్.. వైష్ణ‌వ్ తేజ్‌తో సినిమా చేయ‌డానికి డేట్స్ తీసేసుకుంద‌ట‌. వైష్ణవ్ తేజ్‌తో అన్నపూర్ణ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగార్జున సినిమాను నిర్మించ‌బోతున్నాడు. ఈ సినిమాతో పృథ్వీ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతుండ‌టం విశేషం. జూలై నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published: