Comedy Stars: తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ అందించే షోలలో జబర్దస్త్ ఒకటి. ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో రెండు భాగాలుగా వచ్చే ఈ కామెడీ షో గత కొన్నేళ్లుగా టాప్‌లో నడుస్తోంది. ఈ షోలో పాల్గొన్న ఎంతోమంది సినిమాల్లోనూ అవకాశాలు తెచ్చుకున్నారు, ఇప్పటికీ తెచ్చుకుంటున్నారు. ఇక ఈ షోకు పోటీగా మిగిలిన ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు ఇలాంటి కామెడీ షోలను ప్రేక్షకుల కోసం తీసుకొచ్చారు. అయితే అవేవీ జబర్దస్త్‌కి పోటీ ఇవ్వలేదు సరికదా.. కొన్నైతే ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు పోయాయో తెలీకుండానే పోయాయి. ఇక ఆ మధ్యలో జబర్దస్త్‌లో ఒక జడ్జిగా పనిచేసిన నాగబాబు మరో ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జీ తెలుగులోకి వెళ్లి.. అక్కడ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించారు. దీన్ని ప్రారంభించే సమయంలో చాలా హైప్‌ని తీసుకొచ్చారు. అంతేనా జబర్దస్త్‌కి సెటైర్‌గా ప్రోమోలను కూడా విడుదల చేశారు. కానీ ప్రారంభం అయిన తరువాత మాత్రం జబర్దస్త్‌ని బీట్ చేయలేకపోయింది.
ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం టాప్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌గా కొనసాగుతున్న స్టార్ మా మరో ప్రయోగం చేయబోతోంది. కామెడీ స్టార్స్ పేరుతో స్టార్‌లో మాలో ఒక కొత్త షో రాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి జడ్జిలుగా ఉండబోతున్నారు. అలాగే యాంకర్ వర్షిణి, యాంకర్ రవిలు కూడా ఈ ప్రోమోలో కనిపించారు. వీరితో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అవినాష్, అరియానా, అషు రెడ్డి, సుజాతలు కూడా ఈ ప్రోగ్రామ్‌లో కనిపించనున్నారు.
Mimmalni entertain cheyataniki mi intiki vachestunnam!!!#ComedyStars coming soon on @StarMaa pic.twitter.com/Nr1c1RygcS
— starmaa (@StarMaa) January 23, 2021
అలాగే చమ్మక్ చంద్ర, యాదమ్మ రాజు, బేబి సహృద(కార్తీక దీపం హిమ) తదితరులు కనిపించారు. ప్రోమో చూస్తుంటే అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఈ షో అయినా జబర్దస్త్‌కి పోటీ ఇవ్వనుందా..? లేక మిగిలిన కామెడీ షోలలాగే మిగిలిపోనుందా..? చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Star Maa, Television News