Star Heros Flop Films: క్లైమాక్స్ కారణం అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

Star Heros Flop Films

Star Heros Flop Films: సినిమా అంటే అన్ని రకాల నవరసాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆ నవరసాలు నటించే నటీనటులను కాకుండా వీక్షించే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. మొదటి నుండి చివరి వరకు సినిమా మొత్తం ఆసక్తిగా ఉండాలి.

  • Share this:
    Star Heros Flop Films: సినిమా అంటే అన్ని రకాల నవరసాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆ నవరసాలు నటించే నటీనటులను కాకుండా వీక్షించే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. మొదటి నుండి చివరి వరకు సినిమా మొత్తం ఆసక్తిగా ఉండాలి. అలా ఉంటేనే ప్రేక్షకులు సినిమాకు మార్కులు వేస్తారు. లేదంటే అంతే సంగతి. ఫస్టాఫ్ బాగుండి సెకండాఫ్ బాలేకపోతే ప్రేక్షకుల దృష్టిలో ఆ సినిమా బోల్తా కొట్టినట్లే. ఇక ముఖ్యంగా సినిమా అంతా బాగుండి చివరికి క్లైమాక్స్ సమయంలో మెప్పించేలేకపోయినా కూడా సినిమా హిట్ కానట్లే. అలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం..

    Star Heros Flop Films
    Star Heros Flop Films


    శీను: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, ట్వింకిల్ ఖన్నా కలిసి నటించిన సినిమా శీను. శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు బాగా ఆకట్టుకుంది. కానీ క్లైమాక్స్ సీన్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా హిట్ కాలేకపోయింది.

    Star Heros Flop Films
    Star Heros Flop Films


    మెరుపు కలలు: టాలీవుడ్ హీరో ప్రభుదేవా బాలీవుడ్ బ్యూటీ కాజోల్ కలిసి జంటగా నటించిన మెరుపు కలలు సినిమా కూడా చివరి వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆఖరి క్లైమాక్స్ సమయంలో మాత్రం నిరాశ పరిచింది. ఇక ఈ సినిమా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది.

    Star Heros Flop Films
    Star Heros Flop Films


    భీమిలి కబడ్డీ జట్టు: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో హీరో నాని చనిపోవడంతో హీరో పాత్రనే అలా అయినందుకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

    Star Heros Flop Films
    Star Heros Flop Films


    వేదం: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, అనుష్క నటించిన వేదం. ఈ సినిమా మంచి కథతో తెరకెక్కింది. కానీ ఈ సినిమా కూడా క్లైమాక్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

    Star Heros Flop Films
    Star Heros Flop Films


    చక్రం: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఛార్మి, అసిన్ కలసి నటించిన చక్రం సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ ఇందులో కూడా ప్రభాస్ చనిపోవడంతో చివరి క్షణాల్లో ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. దీంతో ఈ సినిమా ప్రభాస్ అభిమానులను మెప్పించలేకపోయింది.

    Star Heros Flop Films
    Star Heros Flop Films


    ఈ సినిమాలు మాత్రమే కాదు మరికొన్ని అద్భుతమైన సినిమాలు.. పవన్ కళ్యాణ్ బంగారం, మహేష్ బాబు అతిథి, అల్లు అర్జున్ హ్యాపీ వంటి సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి.. ఇవి మాత్రమే కాకుండా మీకు తెలిసిన క్లైమాక్స్ ఫిలిమ్స్ ఏవో కామెంట్స్ లో తెలపండి.
    Published by:Navya Reddy
    First published: