• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • STAR HEROINE SAI PALLAVI SHOCKING DECISION PAIR UP WITH COMEDIAN MHN

Sai Pallavi: సాయిపల్లవి రూటే సపరేటు.. కమెడియన్ తో జోడీ కడుతున్న స్టార్ హీరోయిన్

Sai Pallavi: సాయిపల్లవి రూటే సపరేటు.. కమెడియన్ తో జోడీ కడుతున్న స్టార్ హీరోయిన్

Star Heroine Sai Pallavi shocking decision Pair up with comedian

Sai Pallavi: తెలుగు ప్రేక్షకులకు ఫిదా సినిమాతో పరిచయమైన సాయిపల్లవి ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తెలిసిన సినీ వర్గాలు సాయిపల్లవి రూటే సపరేటు అని అంటున్నారు

  • Share this:
    తమిళ పొన్ను సాయిపల్లవి .. దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్‌. కెరీర్ బిగినింగ్‌ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఫిదా సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు తొలి సినిమాతో తనదైన పెర్ఫామెన్స్‌తో అందరినీ కట్టిపడేసింది. అంతే కాదండోయ్‌.. కమర్షియల్‌ సినిమాల్లోనే నటిస్తానని హీరోయిన్స్‌ అనుకుంటున్న సమయంలో సాయిపల్లవి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలకే ఓటు వేస్తూ నటిస్తూ వచ్చింది. గెలుపు ఓటముల గురించి కాకుండా డిఫరెంట్‌ సినిమాలు చేయాలనే సాయి పల్లవి ఆలోచనే ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. అందుకనే ఈమెకు వరుస అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. లేటెస్ట్‌ సమాచారం మేరకు సాయిపల్లవి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏకంగా ఓ కమెడియన్‌తో జోడీ కట్టడానికి ఆమె ఓకే అన్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

    వివరాల మేరకు, తమిళంలో కామెడీ పాత్రలు చేసే నటుడు కాళి వెంకట్‌తో సాయిపల్లవి జోడీ కట్టబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కథ, పాత్ర నచ్చడంతో సాయిపల్లవి కూడా కాళి వెంకట్‌తో నటించే అవకాశాలున్నాయని వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన సినీ వర్గాలు షాక్‌ అవుతున్నాయనే చెప్పాలి. ఓ స్టార్‌ హీరోయిన్‌ కమెడియన్‌తో జోడీ కట్టడమనేది గొప్ప విషయమే కదా.. అందుకే సాయిపల్లవి రూటే సపరేటు అని తమిళ తంబీలు అనుకుంటున్నారట.

    sai pallavi, tamil heroine sai pallavi, sai pallavi shocking decision, sai pallavi pair up comedian, kali venkat, sai pallavi and kali venkat, virata parvam, love story, shyam singaroy, సాయిపల్లవి
    Star Heroine Sai Pallavi shocking decision Pair up with comedian


    తెలుగులో ప్రస్తుతం సాయిపల్లవి రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరి ..నానితో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాల్లో నటిస్తుంది. ఇవి కాకుండా అయ్యప్పనుమ్‌ కోశియమ్‌ చిత్రంలోనూ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా వెట్రిమారన్‌ డైరెక్ట్‌ చేసిన పావ కథైగల్‌ అనే అంథాలజీలోనూ సాయిపల్లవి నటించింది.
    Published by:Anil
    First published: