హోమ్ /వార్తలు /సినిమా /

Keerthy Suesh: చీరకట్టులో కీర్తి సురేశ్..ఇన్‌స్టాలో బ్యూటిఫుల్ పిక్స్

Keerthy Suesh: చీరకట్టులో కీర్తి సురేశ్..ఇన్‌స్టాలో బ్యూటిఫుల్ పిక్స్

కీర్తి సురేష్

కీర్తి సురేష్

Keerthy Suresh - Insta Photos: కీర్తిసురేశ్ లేటెస్ట్‌గా చీరకట్టులో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడమే కాకుండా మ్యారేజ్ వైబ్స్ అనే క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

  చ‌క్క‌న్న‌మ్మా ఏదీ చేసినా అంద‌మే అని అంటున్నారు మ‌ల‌యాళ బ్యూటీ కీర్తిసురేశ్‌ను చూసి ఆమె అభిమానులు. రీసెంట్‌గా చీర‌క‌ట్టులో ఉన్న కీర్తిసురేశ్ ఫొటో ఒక‌టి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోను కీర్తి త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ క‌ల‌ర్ శారీ.. ప‌ట్టు జ‌రీలో కీర్తిసురేశ్ మెరిసిపోతుంది. వెడ్డింగ్ వైబ్స్ అనే క్యాప్ష‌న్ ఇచ్చింది. రీసెంట్‌గా దుబాయ్‌లో కీర్తిసురేశ్ త‌న స్నేహితురాలి పెళ్లికి అటెండ్ అయ్యి సంద‌డి చేసింది. అప్పుడు తీసుకున్న ఫొటోను కీర్తి పోస్ట్ చేసింది. అలాగే ఈ మ‌ధ్య‌న ఓనం పండుగ సంద‌ర్భంగా కేర‌ళ సంప్ర‌దాయ దుస్తుల్లోనూ కీర్తిసురేశ్ అందంగా క‌నిపించి ఆక‌ట్టుకుంది. కీర్తి ఫొటోలు, వీడియోలు ఆమె అభిమానుల‌నే కాదు.. అంద‌రికీ ఆక‌ట్టుకుంటోంది. సినీ బ్యాగ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ మ‌ల‌యాళ బ్యూటీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టిస్తూనే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అదే స‌మయంలో మ‌హాన‌టి సినిమాకు నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకుని డ‌బుల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.


  ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న కీర్తిసురేశ్.. రంగ్ దే సినిమాలో జోడీగా న‌టిస్తోంది. దుబాయ్‌లో జ‌రుగుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఈ బ్రేక్‌లో నితిన్ దిల్‌రాజు యాబైవ పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు హాజ‌రైతే, కీర్తిసురేశ్ మాత్రం దుబాయ్‌లోనే త‌న స్నేహితుల పెళ్లికి హాజ‌రైంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను పూర్తి చేసేసి కీర్తిసురేశ్ త‌దుప‌రి సినిమాకు సిద్ధ‌మ‌వ‌డానికి చిన్న గ్యాప్ తీసుకుంటుంది.


  ఈ ఏడాది కోవిడ్ స‌మయంలో కీర్తిసురేశ్ న‌టించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్‌, మిస్ ఇండియా.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డ్డాయి. గుడ్ ల‌క్ స‌ఖి సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలు కాకుండా కాస్త గ్యాప్ త‌ర్వాత కీర్తిసురేశ్ మ‌రో స్టార్ హీరోతో జ‌త క‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ స్టార్ హీరో ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌ర్కారువారి పాట సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. జ‌న‌వ‌రి నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమా కోసం తానెంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని కీర్తిసురేశ్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలోనూ తెలియ‌జేసింది. ఆమెతో పాటు కీర్తి సురేశ్ అభిమానులు కూడా మ‌హేశ్ సినిమాలో ఎలాంటి పాత్ర‌లో మెరిపిస్తుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

  Published by:Anil
  First published:

  Tags: Instagram, Keerthy Suresh, Mahanati, Tollywood

  ఉత్తమ కథలు