• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • STAR HEROINE APPROACHED FOR ALLU ARJUN MOVIE BUT WILL SHE ACCEPT THAT ROLE MHN

Allu Arjun - Sai Pallavi: బ‌న్నీ సినిమాలో మ‌రో స్టార్ హీరోయిన్.. అలాంటి పాత్ర‌కు ఒప్పుకుంటుందా?

Allu Arjun - Sai Pallavi: బ‌న్నీ సినిమాలో మ‌రో స్టార్ హీరోయిన్.. అలాంటి పాత్ర‌కు ఒప్పుకుంటుందా?

Star heroine approached for Allu Arjun movie but will she accept that role

Allu Arjun - Sai Pallavi: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా సాయిపల్లవి ఓ పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సాయిపల్లవి ఏ పాత్రలో నటిస్తుందో తెలుసా?

  • Share this:
    స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’ సినిమాను జ‌న‌వ‌రి 8 నుండి సెట్స్‌లోకి తీసుకెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవ‌ల రాజ‌మండ్రి స‌మీపంలోని మారేడుమిల్లి అట‌వీ ప్రాంతంలో స్టార్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్‌లో కొంత మంది యూనిట్ స‌భ్యుల‌కు కోవిడ్ సోక‌డంతో.. షూటింగ్‌ను అపేశారు. అయితే మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌ళ్లీ షూటింగ్‌ను రీస్టార్ట్ చేయ‌డానికి పుష్ప యూనిట్ రెడీ అయ్యింది. ఇందులో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పుడు ఈమెతో పాటు మ‌రో హీరోయిన్‌ను రంగంలోకి దింప‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే మ‌రో హీరోయిన్ మాత్రం బ‌న్నీకి జోడీగా కాకుండా బ‌న్నీ చెల్లెలు పాత్ర క‌నిపిస్తుంది.

    బ‌న్నీ చెల్లెలు పాత్రే క‌దా, ఎవ‌రైనా చిన్న హీరోయిన్‌ను తీసుకోవ‌చ్చు క‌దా, అనుకోవ‌చ్చు. ‘పుష్ప‌’ సినిమాలో ఈ పాత్ర‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంద‌ట‌. తెలుగు, మ‌ల‌యాళంలో బ‌న్నీకి ఎలాగూ మార్కెట్ ఉంది. దీంతో పాటు ‘పుష్ప‌’ సినిమా త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. కాబ‌ట్టి స్టార్ హీరోయిన్ ఆ పాత్ర‌లో న‌టిస్తే సినిమాకు క్రేజ్ ఉంటుంద‌ని భావించి ఓ స్టార్ హీరోయిన్‌ను సంప్ర‌దించే ప‌నిలో సుక్కు అండ్ టీమ్ ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

    allu arjun, aa20, pushpa, director sukumar, allu arjun as pushpa, sukumar pushpa, maredumilli, pushpa shoot re starts, rashmika mandanna, sai pallavi, pushpa latest update, sai pallavi in pushpa, పుష్ప, అల్లు అర్జున్, రష్మిక మందన్న, సాయిపల్లవి
    Star heroine approached for Allu Arjun movie but will she accept that role


    ఇంత‌కు ‘పుష్ప‌’ సినిమాలో బ‌న్నీ చెల్లెలు పాత్ర‌లో సుకుమార్ న‌టింప చేయాల‌ని అనుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా? ... సాయిప‌ల్ల‌వి. అయితే ఈ త‌మిళ పొన్ను హీరోయిన్‌గా మంచి అవ‌కాశాల‌తో మంచి స్వింగు మీదుంది. అలాంటప్పుడు బ‌న్నీ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించాల‌ని అనుకుంటుంది కానీ.. చెల్లెలు పాత్ర‌లో న‌టిస్తుందా? అని టాక్ కూడా వినిపిస్తోంది. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు వెయిటింగ్ త‌ప్ప‌దు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు