• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • STAR HEROES STILL NOT COMING TO SHOOTINGS THAN WHAT IS THE USE OF REOPENING THEATRES PK

Cinema Theatres: హీరోలు షూటింగ్‌కే రావట్లేదు.. థియేటర్స్ తెరుచుకుని ఏం చేస్తారబ్బా..?

Cinema Theatres: హీరోలు షూటింగ్‌కే రావట్లేదు.. థియేటర్స్ తెరుచుకుని ఏం చేస్తారబ్బా..?

టాలీవుడ్ హీరోస్ (tollywood heroes)

Cinema Theatres: అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెనింగ్.. వినడానికి ఈ పదం బాగానే అనిపిస్తుంది.. కానీ ఎంతమంది దీనికి ఓటేస్తున్నారంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టం.

  • Share this:
అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెనింగ్.. వినడానికి ఈ పదం బాగానే అనిపిస్తుంది.. కానీ ఎంతమంది దీనికి ఓటేస్తున్నారంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ తెరవాలనుకోవడమే పెద్ద సాహసం. అయితే ఇప్పుడు దాచాల్సింది కూడా ఏం లేదు. ఇప్పటికే కరోనా వైరస్‌తో సహజీవనం మొదలైపోయింది. రోజుకు దాదాపు 80 వేల కేసులు వచ్చేస్తున్నాయి. నిండా మునిగిన తర్వాత చలి కూడా అవసరం లేదు. అందుకే అన్నీ ఓపెన్ అనేసింది కేంద్రం. అన్‌లాక్ 5.0 గైడ్ లైన్స్‌లో భాగంగా అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్‌తో థియేటర్స్, మల్టీప్లెక్సులు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది కేంద్రం. అయితే థియేటర్స్ ఇప్పటికిప్పుడు ఓపెన్ చేసినా కూడా అందులో వేసుకోడానికి సినిమాలు అయితే కావాలి కదా.. హీరోలు ఇప్పటి వరకు షూటింగ్‌కే రావడం లేదు అప్పుడే థియేటర్స్ తెరుచుకుని ఏం చేస్తారు అనేది అర్థం కాని విషయం.
సినిమా థియేటర్స్ (cinema theatres)
సినిమా థియేటర్స్ (cinema theatres)

షూటింగ్ చేసుకోమ్మని కేంద్రం పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు చాలా మంది హీరోలు బయటికి రావడం లేదు. ఇల్లు దాటి బయటికి రావట్లేదు.. అనుమతులు ఇచ్చినా కూడా షూటింగ్ చేసుకోలేం అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు వయసు 60 పైనే ఉంది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఇప్పుడు షూటింగ్ కోసం బయటికి రావడం లేదు. మహేష్ బాబు అయితే ఇప్పట్లో షూటింగ్‌కు రాలేనని చెప్పేసాడు.
థియేటర్స్ రీ ఓపెన్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెన్ (Theatres reopening)

ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కూడా అంతే. అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా ఇప్పట్లో షూటింగ్‌కు వచ్చేలా కనిపించడం లేదు. పెద్ద సినిమాలన్నీ అలాగే ఆగిపోయాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా అన్నీ చిన్నవే కానీ పెద్ద సినిమాలు అయితే కాదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సిద్ధంగా ఉన్నా కూడా 50 శాతం ఆక్యుపెన్సీ అంటే వర్కవుట్ కాదు. ఎందుకంటే పవన్ సినిమాకు 100 కోట్లకు పైగా కలెక్షన్ వస్తే కానీ సేఫ్ కాదు.. అలాంటిది సగం టికెట్స్ అమ్ముకుని అంత లాభం వస్తుందా అంటే వర్కవుట్ అయ్యే ఇష్యూ కాదది.
థియేటర్స్ రీ ఓపెన్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెన్ (Theatres reopening)

అలాంటిదిప్పుడు థియేటర్స్ తెరుచుకోండి అంటే మాత్రం ఓపెన్ చేసుకుని ఏం చేస్తారు..? పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే తప్ప థియేటర్స్ వైపు జనం కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే పరిస్థితులు ప్రస్తుతం అలాగే ఉన్నాయి మరి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ సినిమాలు విడుదలైతే తప్ప ఇప్పుడు సగం ఆక్యుపెన్సీ కూడా నిండదు. అలా కాకుండా అసలు 50 శాతం టికెట్స్ అమ్ముకోండి అన్నపుడు అదెలా వర్కవుట్ అవుతుందనేది కూడా మిలియన్ డాలర్ ప్రశ్న.
Published by:Praveen Kumar Vadla
First published: