Hero Ram: ఈ మధ్య సినిమాలలో ఎక్కువగా హీరోలకు సమాన క్రేజ్ ఉండేటట్లు విలన్ లను చూపిస్తున్నారు. అంతేకాకుండా విలన్ లను ఎన్నుకునే విషయంలో కూడా స్టార్ నటులను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాలో విలన్ గా స్టార్ నటులు పరిచయమయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్ హీరో రామ్ కోసం కూడా మరో స్టార్ నటుడు విలన్ గా కనిపించనున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో స్టార్ నటుడిని విలన్ గా పరిచయం చేయాలని అనుకుంటున్నాడట డైరెక్టర్ లింగస్వామి. ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే మాధవన్ కూడా ఒప్పుకున్నాడట.
మాధవన్ తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తమిళంలో ఎన్నో సినిమాలో నటించి స్టార్ నటుడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే గతంలో లింగుస్వామి దర్శకత్వంలో మాధవన్ నటించగా అడిగిన వెంటనే విలన్ గా చేయడానికి ఒప్పుకున్నాడట. అంతేకాకుండా మాధవన్ సవ్యసాచి సినిమా లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మాధవన్ ను విలన్ గా తీసుకోవడానికి మరో కారణం ఉందని తెలుస్తుంది. మాధవన్ నటించే సినిమాలో తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారనే నేపథ్యంలో ఆయనను రిక్వెస్ట్ చేశాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుందని తెలిసింది. ఈ సినిమా తో పాటు రామ్.. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో కూడా మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.