STAR DIRECTORS LIKE SRINU VAITLA BOAYAPATI SRINU VV VINAYAK FADE OUT WITH SINGLE DISASTER
ఒకే ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్ ఆ దర్శకుల కొంప ముంచేసిందిగా..
వినాయక్ బోయపాటి శ్రీనువైట్ల
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర దర్శకులు వాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు వాళ్లకు బ్యాడ్ టైం మొదలైంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన సినిమాలు తెరకెక్కించిన ఈ దర్శకులు.. ఇప్పుడు ఒక విజయం అంటూ అల్లాడిపోతున్నారు పాపం. ఇప్పటికే వినాయక్, శ్రీనువైట్ల ఈ లిస్టులో ఉన్నారు.. ఇప్పుడు బోయపాటి కూడా వచ్చాడు.
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర దర్శకులు వాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఇప్పుడు వాళ్లకు బ్యాడ్ టైం మొదలైంది. ఒకప్పుడు చరిత్ర సృష్టించిన సినిమాలు తెరకెక్కించిన ఈ దర్శకులు.. ఇప్పుడు ఒక విజయం అంటూ అల్లాడిపోతున్నారు పాపం. తాజాగా బోయపాటి శ్రీను కూడా ఇదే జాబితాలో చేరిపోయాడు. ఈయన తెరకెక్కించిన వినయ విధేయ రామ చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్‌గా మారింది రామ్ చరణ్. హీరోగా వచ్చిన ఈ సినిమా తొలి రోజు మార్నింగ్ షో కూడా పడకముందే ఫ్లాప్ అని తేల్చేశారు ప్రేక్షకులు.
బోయపాటి శ్రీను
దాంతో ఇన్నాళ్ళ నుంచి బోయపాటికి ఉన్న ఇమేజ్ ఒక్క సినిమాతో పోయింది. ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే సినిమా విజయం సాధించకపోతే బోయపాటి కెరీర్ మరింత డైలమాలో పడటం ఖాయం. ఇదిలా ఉంటే ఈయన కంటే ముందే వరుసగా మాస్ సినిమాలు చేసి దారుణంగా దెబ్బ తిన్నాడు వి.వి.వినాయక్. అప్పట్లో ఈ దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే బాక్స్ బద్ధలైపోయేది. కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. అఖిల్, అల్లుడు శీను, ఇంటలిజెంట్ లాంటి సినిమాలు ఈయన ఇమేజ్ మొత్తం తీసేసాయి.
వివి వినాయక్
ఇప్పుడు ఈయనకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నా కూడా ఆలోచించే స్థాయికి దిగజారిపోయింది వినాయక్ ఇమేజ్. బాలయ్యతో సినిమా అనుకున్నా కూడా ఇప్పట్లో అది తెరకెక్కే అవకాశం లేకపోవడంతో వెంకటేష్ సినిమాపై వర్క్ చేస్తున్నాడు వినాయక్. శీనువైట్ల పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఒకప్పుడు సంచలన సినిమాలు తెరకెక్కించిన వైట్ల నాలుగేళ్లుగా వరుస పరాజయాలతో రేసులో వెనకబడిపోయాడు. ఆగడు సినిమా నుంచి శ్రీనువైట్ల జాతకం తిరగబడింది.
శ్రీనువైట్ల ఫైల్ ఫోటో
బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు పోటీపడి మరీ డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ఈయనకు అవకాశం ఇవ్వడం అంటే సొంత గోతిలో పడటమే అని భావిస్తున్నారు హీరోలు. పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. ఉంది కాకపోతే ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఏదో ఒక హీరోను మాయ చేసి అవకాశం అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు పూరీ. ఈ దర్శకులకు ఇప్పుడు గాని విజయం రాకపోతే పూర్తిగా మరిచిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.