వెండితెర, బుల్లితెరకు ధీటుగా ప్రేక్షకుడికి వినోదాన్ని అందిస్తున్న మాధ్యమం డిజిటల్. ప్రేక్షకుడు థియేటర్‌కు రానక్కర్లేదు. తనకు వీలున్నప్పుడల్లా సినిమాను చూడొచ్చు. దీంతో ఓటీటీ అభివృద్ధికి తిరుగు లేకుండా పోయింది. చాలా ఓటీటీ సంస్థలు.. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు, ఒరిజినల్స్‌తో ప్రేక్షకుల అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మంచి రెమ్యునరేషన్స్ వస్తుండటంతో పెద్ద పెద్ద స్టార్స్, టెక్నీషియన్స్ డిజిటల్ మాధ్యమాల్లో పనిచేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. చాలా మంది ఇప్పటికే ఓటీటీ బాట పట్టినవారే.
తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి స్టార్స్‌లో చాలా మంది ఓటీటీ బాట పట్టారు. అయితే స్టార్ దర్శకుల్లో కొందరు మాత్రమే ఓటీటీ వైపు అడుగులేశారు. అయితే సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్ వంటి అగ్ర దర్శకులు సైతం ఓటీటీల్లో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే మరికొందరు టాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట.
ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓ భారీ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసింది. ఈ వెబ్ సిరీస్‌ను నలుగురు దర్శకులు తెరకెక్కించనున్నారట. అందులో హరీశ్ శంకర్ ఓ దర్శకుడు కాగా.. డైరెక్టర్ అజయ్ భూపతి, డైరెక్టర్ శివ నిర్వాణ కూడా ఈ వెబ్ సిరీస్‌లో చేతులు కలపబోతున్నారు. వీరితో పాటు మరో స్టార్ దర్శకుడు కూడా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాడట. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని టాక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Shankar, Tollywood