హోమ్ /వార్తలు /సినిమా /

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో ఆ యువ దర్శకుడికి అన్యాయం జరుగుతుందా..?

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో ఆ యువ దర్శకుడికి అన్యాయం జరుగుతుందా..?

ఎంతవరకు వెళ్లిపోయిందంటే పవన్ పేరు చెప్తేనే వైసీపీ నాయకులు మండి పడుతున్నారు. మరోవైపు పవన్ కూడా అదే చేస్తున్నాడు. ఇద్దరూ ఉప్పు నిప్పుల్లా మండిపోతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ నటిస్తున్న సినిమాలు థియేటర్స్‌లో విడుదల చేయడం అనేది మామూలు విషయం కాదు. చేసినా కలెక్షన్స్‌పై కూడా ప్రభావం పడటం ఖాయం.

ఎంతవరకు వెళ్లిపోయిందంటే పవన్ పేరు చెప్తేనే వైసీపీ నాయకులు మండి పడుతున్నారు. మరోవైపు పవన్ కూడా అదే చేస్తున్నాడు. ఇద్దరూ ఉప్పు నిప్పుల్లా మండిపోతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ నటిస్తున్న సినిమాలు థియేటర్స్‌లో విడుదల చేయడం అనేది మామూలు విషయం కాదు. చేసినా కలెక్షన్స్‌పై కూడా ప్రభావం పడటం ఖాయం.

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమా విషయంలో కుర్ర దర్శకుడికి అన్యాయం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నది సాగర్ కే చంద్ర (Sagar K Chandra) అయినా కూడా ఎక్కువగా పేరు మాత్రం త్రివిక్రమ్‌కే (Trivikram) వస్తుందంటూ వాదనలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నపుడు కేవలం ఆయన గురించే తప్ప మరెవరి గురించి కూడా పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే అక్కడ పవన్ మాత్రమే అందరికీ కనిపిస్తుంటాడు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. పేరుకు మల్టీస్టారర్ సినిమానే అయినా కూడా పవన్ ఎంట్రీ తర్వాత పూర్తిగా సింగిల్ స్టారర్ మూవీ అయిపోయింది ఇది. ముఖ్యంగా ఈ చిత్రంలో రానా ఉన్నా కూడా ఆయన పాత్రను తగ్గించారు అనే ప్రచారమే జోరుగా జరుగుతుంది. ఒకవేళ ఒరిజినల్‌లో ఉన్నట్లే ఉన్నా కూడా పవన్ ముందు తేలిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విషయంలో మరోటి కూడా జరుగుతుంది. ఈ సినిమా విషయంలో కుర్ర దర్శకుడికి అన్యాయం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ సినిమాను ఎవరు తెరకెక్కిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం సాగర్ కే చంద్ర.

చిన్న దర్శకుడే అయినా కూడా పనితీరు నచ్చి పవన్ సినిమాను తెరకెక్కించే అవకాశం ఇచ్చారు. అయితే పేరుకు ఆయన దర్శకుడే అయినా కూడా అన్నీ వెనకుండి చూసుకుంటుంది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్. నిజానికి ఆయన ఉన్నాడనే ధైర్యంతోనే పవన్ కూడా ఈ సినిమా చేయడానికి సై అన్నాడని తెలుస్తుంది. తను స్టార్ డైరెక్టర్ అయినా.. పవన్ కోసం ఓ మెట్టు దిగి స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ వచ్చిన తర్వాత భీమ్లా నాయక్ రేంజ్ మారిపోయింది.

Priya Prakash Varrier: పెళ్లి కూతురు ముస్తాబురో.. క్లీవేజ్ షోతో మతులు చెడగొడుతున్న ప్రియా వారియర్..


ఈ చిత్రం పూర్తిగా కేరాఫ్ త్రివిక్రమ్ అయిపోయింది. ఇందులో పవన్ కోసం కొన్ని ఎక్స్ ట్రా సీన్స్ కూడా జత చేసారని తెలుస్తుంది. పవన్ ఇమేజ్‌కు సరిపోయేలా.. ఒరిజినల్ కథ చెడిపోకుండా త్రివిక్రమ్ మరికొన్ని సీక్వెన్సులు యాడ్ చేసారని.. అవి కచ్చితంగా ప్రేక్షకులను మరింత అలరించడం ఖాయం అనే నమ్మకంతోనే ఉన్నారు అభిమానులు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 12న భీమ్లా నాయక్ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మధ్యే పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన తొలి పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.

Bigg Boss 5 Telugu first week Elimination: తొలివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా.. సోషల్ మీడియాలో సాక్ష్యాలు..


టైటిల్ సాంగ్‌కు ఊహించని రీచ్ వచ్చింది. టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ అందుకున్న పాటగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది. అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రం విషయంలో సాగర్ కే చంద్రకు మాత్రం అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తుంది. త్రివిక్రమ్ అనే చెట్టు నీడలో సాగర్ కే చంద్ర పూర్తిగా కనిపించకుండా పోతున్నాడని.. వచ్చే క్రెడిట్ అంతా కేవలం ఆయనకు మాత్రమే వెళ్తుందని వార్తలొస్తున్నాయి. దర్శకుడిగా సాగర్ పేరు పడుతున్నా.. కర్త కర్మ క్రియ మాత్రం త్రివిక్రమ్ అనేది అందరికీ ఇట్టే అర్థమైపోతుంది. మరి రాబోయే రోజుల్లో అయినా ‘భీమ్లా నాయక్’ క్రెడిట్ సాగర్ కే చంద్రకు వస్తుందా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Bheemla Nayak, Pawan kalyan, Telugu Cinema, Tollywood, Trivikram

ఉత్తమ కథలు