• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • STAR DIRECTOR SS RAJA MOULI TWEET ON FRIEND SHIP DAY 2019 SB

రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?

రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి

మొత్తానికి ఈ ట్వీట్ చేసి రాజమౌళి తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేశారని ఆయన అభిమానులు... టాలీవుడ్ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.

  • Share this:
    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి ఈ పేరు తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ సినిమాతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల రాజమౌళి. ప్రముఖ తెలుగు దర్శకుడు శిష్యుడిగా స్టూడెంట్ నెంబర్.1 చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అయితే స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు రాజమౌళి. వారాహి చలనచిత్రం అధినేత, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు.

    ‘చిన్నపిల్లాడి మనస్తత్వం, నమ్మకానికి రూపం, వెన్నంటి ఉండే బలం. ఆయన నా భీమ్‌. ఆయన ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ కామెంట్ చేశారు రాజమౌళి. ఈ ట్వీట్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌ యే దోస్తీ(#RRRYehDosti) అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. విధి అనుకూలంగా ఉన్న సమయంలో జీవితంలో సాయి వంటి వ్యక్తి పరిచయం అవుతాడని, అతడిది చిన్నపిల్లవాడి మనస్తత్వం అని పేర్కొన్నారు జక్కన్న. మొత్తానికి ఈ ట్వీట్ చేసి రాజమౌళి తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేశారని ఆయన అభిమానులు... టాలీవుడ్ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.

    Published by:Sulthana Begum Shaik
    First published: