Home /News /movies /

STAR DIRECTOR MANI RATHNAM HOSPITALIZED DUE TO COVID 19 SLB

Mani Ratnam: పంజా విసురుతున్న కోవిడ్.. కరోనాతో ఆసుపత్రిలో చేరిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం

Photo Twitter

Photo Twitter

Mani Ratnam Corona: సాధారణ ప్రజలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గానే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడినట్లు తెలియగా.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు కరోనా సోకిందని తెలియడం సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

ఇంకా చదవండి ...
కరోనా వీడిందని అంతా అనుకుంటున్నారు కానీ ఇంకా ఆ మహమ్మారి వైరస్ కంటికి కనిపించకుండా మన చుట్టూనే తిరుగుతోంది. ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గానే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడినట్లు తెలియగా.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు (Mani Ratnam) కరోనా (Covid 19) సోకిందని తెలియడం సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

ఇటీవల కరోనా బారిన పడిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో చేరారు. ఆరోగ్యం కాస్త క్షీణించినట్లు అనిపించడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మణిరత్నం భార్య, సీనియర్ నటి సుహాసిని ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రూపొందుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అలరిస్తూ విల‌క్షణ నటుడిగా ఫుల్ పాపులర్ అయిన విక్రమ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. ఆదిత్య క‌రికాల‌న్ పాత్రలో నటిస్తున్నారు విక్రమ్. కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను రెండు పార్టులుగా రూపొందిస్తుండటం విశేషం.

ఈ క్ర‌మంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేక‌ర్స్. ఇందులో భాగంగా ఈ నెల 8న నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచింగ్‌కు మణిరత్నం హాజరయ్యారు. ఈ సమయంలో మణిరత్నం కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Corona, Covid positive, Mani Ratnam

తదుపరి వార్తలు