శేఖర్ మాస్టర్ కామెడీ అదిరింది.. జబర్దస్త్ ఛమ్మక్ చంద్రతో కలిసి స్కిట్..

శేఖర్ మాస్టర్ అంటే మనకు తెలియకుండానే కళ్ల ముందు కొన్ని స్టెప్పులు కనిపిస్తుంటాయి. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రఫర్ ఈయన. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఇప్పుడు ఆయనే కావాలంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 2, 2019, 8:33 PM IST
శేఖర్ మాస్టర్ కామెడీ అదిరింది.. జబర్దస్త్ ఛమ్మక్ చంద్రతో కలిసి స్కిట్..
శేఖర్ మాస్టర్ కామెడీ స్కిట్ (Source: Youtube)
  • Share this:
శేఖర్ మాస్టర్ అంటే మనకు తెలియకుండానే కళ్ల ముందు కొన్ని స్టెప్పులు కనిపిస్తుంటాయి. టాప్ లేచిపోద్ది అన్నా ఆయనే.. అమ్మడు కుమ్ముడు అన్నా ఆయనే.. పిల్లా నువ్వులేని జీవితం అన్నా ఆయనే.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రఫర్ ఈయన. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఇప్పుడు ఆయనే కావాలంటున్నారు. ఒకప్పుడు ప్రభుదేవా, లారెన్స్ ఎలా అయితే దుమ్ము దులిపేసారో ఇప్పుడు శేఖర్ టైమ్ అలా నడుస్తుంది. వాళ్లు మెల్లగా కొరియోగ్రఫీ నుంచి నటన వైపు వచ్చారు.. ఇప్పుడు సీనియర్ల దారిలోనే నడుస్తున్నాడు శేఖర్ మాస్టర్ కూడా.

Tollywood Star choreographer Sekhar Master tunrnig as actor and done a skit with Chammak Chandra pk శేఖర్ మాస్టర్ అంటే మనకు తెలియకుండానే కళ్ల ముందు కొన్ని స్టెప్పులు కనిపిస్తుంటాయి. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రఫర్ ఈయన. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఇప్పుడు ఆయనే కావాలంటున్నారు. sekhar master,sekhar master twitter,sekhar master dance,sekhar master songs,sekhar master movies,sekhar master jabardasth,sekhar master chammak chandra,sekhar master chammak chandra skit,sekhar master roja song,sekhar master naga babu,sekhar master sudigali sudheer,sekhar master dhee jodi promo,sekhar master comedy,jabardasth judge sekhar master,telugu cinema,avunu valliddaru godava paddaru promo,శేఖర్ మాస్టర్,శేఖర్ మాస్టర్ ఛమ్మక్ చంద్ర,శేఖర్ మాస్టర్ ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు ప్రోమో,శేఖర్ మాస్టర్ కామెడీ స్కిట్,జబర్దస్త్ జడ్జ్ శేఖర్ మాస్టర్,తెలుగు సినిమా
శేఖర్ మాస్టర్ కామెడీ స్కిట్ (Source: Youtube)


ఈయన కూడా ఇప్పుడు మెల్లమెల్లగా నటన వైపు అడుగులు వేస్తున్నాడు. ఇటు వైపు కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. డాన్సుల వరకు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు నటన కూడా ఇరగదీస్తున్నాడు శేఖర్. ముఖ్యంగా ఈటీవీ డిజైన్ చేస్తున్న ప్రోగ్రామ్స్‌లో కామెడీ బ్రహ్మాండంగా పండిస్తున్నాడు ఈయన. ఢీలో సుధీర్‌పై పంచుల వర్షం కురిపించేస్తాడు శేఖర్. ఇక ఇప్పుడు ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు అంటూ వినాయకచవితి కోసం డిజైన్ చేసిన కార్యక్రమంలో అదిరిపోయే కామెడీ స్కిట్ చేసాడు శేఖర్.

ఛమ్మక్ చంద్రతో కలిసి ఈయన చేసిన స్కిట్ ఇప్పుడు విడుదలైంది. ఇది చూసిన తర్వాత నవ్వుకోకుండా ఉండలేరు.. పైగా శేఖర్ మాస్టర్ నటనను చూసి నవ్వు ఆపుకోకుండా కూడా ఉండలేరు. అంతగా కామెడీ చేసాడు ఈయన. ఇదే జోరు కొనసాగిస్తే రేపటి రోజు హీరోగా కూడా మారిపోతాడేమో అనిపిస్తుంది. మొత్తానికి కొరియోగ్రఫర్‌గా మొదలుపెట్టి నటులుగా మారిన లిస్టులోకి ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు.
First published: September 2, 2019, 8:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading