• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • STAR BOLLYWOOD BEAUTY IS GOING TO TURN ITEM GIRL FOR PRABHAS SALAAR MHN

Prabhas - Salaar: ప్రభాస్ ‘సలార్’ కోసం ఐటెమ్ గర్ల్‌గా మారుతున్న బాలీవుడ్ బ్యూటీ..!

Prabhas - Salaar: ప్రభాస్ ‘సలార్’ కోసం ఐటెమ్ గర్ల్‌గా మారుతున్న బాలీవుడ్ బ్యూటీ..!

Star Bollywood Beauty is going to turn item girl for Prabhas Salaar

Prabhas - Salaar: ‘సలార్’ సినిమా కోసం ప్ర‌శాంత్ నీల్ ఓ ఐటెమ్ సాంగ్‌ను ప్లాన్ చేశాడ‌ట‌. సినిమా ప్యాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి అందులో బాలీవుడ్ బ్యూటీని న‌ర్తింప చేస్తే క్రేజ్ ద‌క్కుతుంద‌ని భావించాడ‌ట ప్ర‌శాంత్ నీల్.

  • Share this:
    రెబల్‌స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘స‌లార్‌’. ఈ సినిమా షూటింగ్ చ‌క‌చ‌కా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో.. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒక‌టి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హ‌ల్ చేస్తోంది. ఈ సినిమా కోసం ప్ర‌శాంత్ నీల్ ఓ ఐటెమ్ సాంగ్‌ను ప్లాన్ చేశాడ‌ట‌. సినిమా ప్యాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి అందులో బాలీవుడ్ బ్యూటీని న‌ర్తింప చేస్తే క్రేజ్ ద‌క్కుతుంద‌ని భావించాడ‌ట ప్ర‌శాంత్ నీల్. ఆ బాలీవుడ్ బ్యూటీ ఇంకెవ‌రో కాదు..దీపికా ప‌దుకొనె. ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొందనున్న చిత్రంలో దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్పుడు ఐటెమ్ సాంగ్‌లోనూ న‌టించ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

    ‘కేజీయ‌ఫ్ ఛాప‌ర్ట్‌1’తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ కోసం అంద‌రినీ ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ‘సలార్’ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టం తెలిసిన విష‌య‌మే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుంది. 'సలార్‌' అంటే సైన్యాధిపతి.. కింగ్‌ మేకర్‌ అనే అర్థం వస్తుందంటూ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలియజేసిన సంగతి తెలిసిందే. మరి ఇందలో కింగ్ ఎవరు? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. సినిమా కోసం ప్రభాస్‌ నాలుగు నెలల సమయాన్ని కేటాయించాడని టాక్‌ వినిపిస్తోంది.

    prabhas, salaar, prabhas salaar, prabhas and shruti haasan, prashanth neel, salaar release date, adi purush, radhe shyam, shruti haasan in salaar, shruti haasan pan india movie, salaar movie latest update, salaar item song deepika padukone in salaar, deepika padokone becomes item girl, deepika item song, ప్రభాస్, రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్, సలార్, ఆది పురుష్
    Star Bollywood Beauty is going to turn item girl for Prabhas Salaar


    'సలార్‌' తర్వాత.. ప్ర‌భాస్‌, ఓం రావుత్ కాంబినేష‌న్‌లో రూపొందిన ‘ఆదిపురుష్‌’ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపిస్తుంటే, రావ‌ణాసురుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు. కృతిస‌న‌న్ సీత పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు ఈ ఏడాదిలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు.
    Published by:Anil
    First published: