Khushi Kapoor: అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో, తన నటనతో ఎంతో గుర్తింపు పొందిన శ్రీదేవి తన ఇద్దరు కూతుళ్లను కూడా సిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎన్నో కలలు కన్నారు. మొత్తానికి తన చివరి కోరిక తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ తీర్చింది. తాజాగా రెండో కూతురు ఖుషి కపూర్ కూడా తన తల్లి చివరి కోరిక తీర్చనుందట. త్వరలోనే వెండితెర పరిచయం చేయనుంది శ్రీదేవి చిన్న కూతురు.
ఇప్పటికే బాలీవుడ్ లో జాన్వీ కపూర్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తన సోదరి ఖుషి కపూర్ కూడా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న ఖుషి.. ఇక సినిమాలలో అడుగుపెట్టాలని అనుకుంటుందట.
ఇక తన తండ్రి బోనీ కపూర్ కూడా ఆమెను సినిమాల్లో పరిచయం చేయడానికి ఎంతో తాపత్రయం పడుతున్నారని తెలుస్తుంది. మొదట తనను బాలీవుడ్ సినిమాతో పరిచయం చేయాలనుకున్నాడట బోనీ కపూర్. కానీ ఇప్పుడు తెలుగు సినిమా తో పరిచయం చేయాలని చూస్తున్నారట. ఇక ఖుషి కపూర్ కూడా యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకుందని తెలుస్తుంది. మొత్తానికి శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ తో కనిపించనుందని తెలిసింది. ఇక ఏ సినిమా హీరో అనే విషయం తెలియక పోగా.. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఖుషి కపూర్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సంబంధించిన హాట్ ఫోటోలు కూడా ఫాలోవర్స్ తో తెగ పంచుకుంటుంది. ఇక ఈ బ్యూటీ ఏ హీరో సరసన అవకాశం కొడుతుందో చూడాలి.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.