Home /News /movies /

STAND UP COMEDY ON METAVERSE UMG GH

Metaverse: మెటావర్స్‌లో స్టాండప్ కామెడీ.. తెలంగాణకే ఆ అరుదైన ఘనత.. ఇక కథ వేరుంటదీ..!

మెటావర్స్‌లో స్టాండప్ కామెడీ.

మెటావర్స్‌లో స్టాండప్ కామెడీ.

ఓ స్టార్టప్‌ ()Start up కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి వర్చువల్‌ కన్సర్ట్‌ను హైదరాబాద్‌లో (Hyderabad) నిర్వహించనుంది. మెటావర్స్‌లో (Metaverse) ఎక్కువ ప్రాజెక్టులకు హైదరాబాద్‌ వేదికగా నిలుస్తోంది. దీంతో మెటావర్స్‌పై పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు దక్కించుకోనుంది.

ఇంకా చదవండి ...
..హైదరాబాద్ నుంచి మెటావర్స్ ఎకోసిస్టమ్‌ విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. మెటావర్స్‌పై అనేక ప్రాజెక్టులు ఇప్పటికే వార్తల్లో నిలిచాయి. ఈ క్రమంలో ఓ స్టార్టప్‌ కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి వర్చువల్‌ కన్సర్ట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనుంది. మెటావర్స్‌లో ఎక్కువ ప్రాజెక్టులకు హైదరాబాద్‌ వేదికగా నిలుస్తోంది. దీంతో మెటావర్స్‌పై పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు దక్కించుకోనుంది. హైదరాబాద్‌ ఐటీ ప్రస్థానంలో ఈ స్టార్టప్‌ కంపెనీ ప్రయత్నంతో మరో మైలు రాయి చేరనుంది.

మెటావర్స్‌లో భారతదేశపు మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు ఇటీవల ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపిన హైదరాబాద్‌కు చెందిన గామిట్రానిక్స్, ఇప్పుడు మెటావర్స్ ప్లాట్‌ఫారమ్‌లో దేశంలోనే మొట్టమొదటి స్టాండ్-అప్ కామెడీ గిగ్‌ను ఆవిష్కరించడానికి ENOతో ఒప్పందం చేసుకుంది. భారతీ ఎయిర్‌టెల్ తన ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో అందుబాటులో ఉన్న ప్రముఖ OTT భాగస్వాముల కంటెంట్ పోర్ట్‌ఫోలియోలను వినియోగించుకునేలా 20-స్క్రీన్ ప్లాట్‌ఫారమ్ అయిన ఎక్స్‌స్ట్రీమ్‌ మల్టీప్లెక్స్‌ (Xstream Multiplex)ను ప్రారంభించింది. వినియోగదారులు మెటావర్స్ వేదికగా ప్రారంభించిన పార్టీ నైట్ మెటావర్స్ ద్వారా మల్టీప్లెక్స్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సేవలను వినియోగదారులకు ప్రస్తుతం ఉచితంగా అందుబాటులో ఉంచారు. OTT ఒరిజినల్ మొదటి ఎపిసోడ్, ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలలో సినిమాలను Xstream ప్రీమియం సర్వీస్ సబ్‌స్క్రిప్షన్‌ నెలకు రూ.149 నుంచి ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి: ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా..? ఈ గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్స్ లిస్ట్ మీకోసమే..!


ENO విడుదల చేసిన ఒక వీడియోలో భారతదేశంలో తమ 50 సంవత్సరాల ప్రయాణాన్ని సెలబ్రేట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకలలో భాగంగా, మునుపెన్నడూ లేని విధంగా ఒక ఈవెంట్‌ను చేస్తోంది. మెటావర్స్‌లో భారతదేశపు మొట్టమొదటి స్టాండ్-అప్ కామెడీ నిర్వహిస్తోంది. హాస్యనటుడు, నటుడు జాకీర్ ఖాన్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో కనీజ్ సుర్కా, రాహుల్ దువా, సాహిల్ బుల్లా, రాహుల్ సుబ్రమణియన్, శ్రద్ధ వంటి ఇతర హాస్య తారలు పాల్గొంటారు. తేదీ, కార్యక్రమం నిర్వహించే సమయాలు వంటి ఈవెంట్ ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు.

ఈ వర్చువల్‌ స్టాండప్‌ కామెడీ ఈవెంట్‌ గురించి గామిట్రానిక్స్ వ్యవస్థాపకుడు రజత్ ఓజా మాట్లాడుతూ..‘మెటావర్స్‌లో స్టాండ్-అప్ కామెడీ షో జరగడం ఇదే మొదటిసారి. ఈ మొత్తం ఈవెంట్‌ను గామిట్రానిక్స్ నిర్వహించడం సంతోషకరం. ఇది హాస్యనటులు ప్రదర్శించే వర్చువల్ ప్రపంచం కాదు, ప్రేక్షకులు కూడా ప్రదర్శనలో భాగమయ్యే ఎకోసిస్టమ్‌ అవుతుంది. స్టాండ్-అప్ కామెడీ షో భౌతికంగా ఎలా జరుగుతుందో అదే విధంగా అనుభూతిని ఇస్తుంది’ అని ఆయన అన్నారు.



గామిట్రానిక్స్(Gamitronics) అనేది హైదరాబాద్‌లో వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) స్టార్టప్. ఇది దాని సొంత మెటావర్స్‌ పార్టీనైట్‌ను నిర్వహిస్తుంది. కంపెనీ తన మెటావర్స్‌ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సమీప భవిష్యత్తులో దాని సొంత NFTలను విక్రయించడానికి టోకెన్‌ను ఆవిష్కరించాలని యోచిస్తోంది. లైవ్ ఈవెంట్‌లు, ప్రీమియం స్పోర్ట్స్ స్ట్రీమింగ్‌లను హోస్ట్ చేయడానికి భవిష్యత్తులో అవకాశం కలుగుతుందని గామిట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
Published by:Mahesh
First published:

Tags: Metaverse

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు