స్పైడర్ మేన్ సృష్టికర్త ‘స్టాన్ లీ’ కన్నుమూత..విషాదంలో హాలీవుడ్

హాలీవుడ్‌లో ‘స్పైడర్ మ్యాన్’, ‘ఎక్స్ మెన్’, ‘ఐరన్ మ్యాన్’, ‘బ్లాక్ ప్యాంథర్’ వంటి సూపర్ హీరోల సృష్టికర్త స్టాన్ లీ ఇకలేరు. గత కొంత కాంలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అమెరికాలోని న్యూయార్క్‌లో తన స్వగృహంలో కన్నుమూసారు. ఆయన వయసు 95 సంవత్సరాలు.

news18-telugu
Updated: November 13, 2018, 10:41 AM IST
స్పైడర్ మేన్ సృష్టికర్త ‘స్టాన్ లీ’ కన్నుమూత..విషాదంలో హాలీవుడ్
స్టాన్‌లీ
news18-telugu
Updated: November 13, 2018, 10:41 AM IST
హాలీవుడ్‌లో ‘స్పైడర్ మ్యాన్’, ‘ఎక్స్ మెన్’, ‘ఐరన్ మ్యాన్’, ‘బ్లాక్ ప్యాంథర్’ వంటి సూపర్ హీరోల సృష్టికర్త స్టాన్ లీ ఇకలేరు. గత కొంత కాంలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అమెరికాలోని న్యూయార్క్‌లో తన స్వగృహంలో కన్నుమూసారు. ఆయన వయసు 95 సంవత్సరాలు.

ఆయన మృతికి పలువురు కామిక్ అభిమానులతో పాటు హాలీవుడ్ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నో కామిక్ పాత్రలతో ప్రేక్షకుల అభిమానం చూరగొన్న స్టాన్‌లీ..1922 డిసెంబర్ 28న న్యూయార్క్‌లో జన్మించారు. బాల్యంలో ఎన్నో కష్టాలను అనుభవించిన స్టాన్‌లీ..ఆ తర్వాత ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారు.

ఆయన రూపొందించిన కామిక్ క్యారెక్టర్స్‌తో మార్వెల్ సంస్థ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను  తెరకెక్కించింది. ఆయన రూపొందించిన క్యారెక్టర్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. మార్వెల్ రూపొందించిన దాదాపు అన్ని చిత్రాల్లో స్టాన్‌లీ అతిథి పాత్రలో నటించడం విశేషం.

కామిక్ చిత్రాల సృష్టికర్త స్టాన్‌లీ
1961లో స్టాన్‌లీ...మార్వెల్ కామిక్స్‌లో చేరారు. ఆయన రూపకల్పనలో ఫస్ట్ టైమ్ ‘ది ఫెంటాస్టిక్ ఫోర్’ అనే క్యారెక్టర్‌ను డిసైన్ చేశారు. ఆ తర్వాతే ‘స్పైడర్ మ్యాన్’, ‘ద ఇంక్రెడిబుల్ హల్క్’, ‘ఐరన్ మ్యాన్’, ‘బ్లాక్ పాంథర్’ డాక్టర్ స్ట్రెయింజ్’, ‘కెప్టెన్ అమెరికా’వంటి క్యారెక్టర్లను ఆయన చేతులు మీదుగా పురుడు పోసుకున్నవే. 2013లో ఆయన రూపొందించిన ‘చక్ర’ కామిక్ క్యారెక్టర్ను  కార్టూన్ నెట్‌వర్క్లో చానెల్‌లో ప్రసారం అయింది.  హాలీవుడ్‌లో ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్‌గా స్టాన్‌లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.

First published: November 13, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...