Home /News /movies /

STAMPED AT TOLLYWOOD PRINCE MAHESH BABU PHOTO SHOOT SB

మహేష్ బాబు ఫోటో షూట్‌లో తొక్కిసలాట... పలువురికి గాయాలు

మహేష్ బాబు ఫైల్ పోటో

మహేష్ బాబు ఫైల్ పోటో

మరోవైపు అభిమానులు,మహిళలపై మహేష్ బౌన్సర్లు దురుసగా ప్రవర్తించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    హైదరాబాద్ సినీ హిరో మహేష్ బాబు అభిమానులతో ఏర్పాటు చేసుకున్న ఫోటో షూట్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. లింగంపల్లిలోని ఆలిండ్ ఫ్యాక్టరీ వద్ద అభిమానులతో మహేష్ బాబుకు ఫోటో షూట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు కొందరు నిర్వాహకులు. మహేష్ బాబుతో ఫోటో షూట్‌కు రావాలని ఏకే ఎంటర్ టైన్ మెంట్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. మహేష్ బాబు కొత్తగా తీస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏకే ఎంటర్ టైన్ మెంట్ ఈ ఈవెంట్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది సమాచారం. అయితే మహేష్‌తో ఫోటో అనగానే అభిమానులు అధిక సంఖ్యలో రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఫోటో షూట్ కోసం పోలీస్ పర్మిషన్ లేకపోవడంతో షూట్ నిలిపివుయడంతో చందానగర్ పోలీసులు అడ్డుకున్నారు. షూట్ కోసం అభిమానులు ఎక్కువగా రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడకు చేరుకున్న మహేష్ షూటింగ్ మధ్యనుంచే వెళ్లిపోయారు. మరోవైపు అభిమానులు,మహిళలపై మహేష్ బౌన్సర్లు దురుసగా ప్రవర్తించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Mahesh Babu Latest News, MaheshBabu26, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు