హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu-Namrata: మహేష్ బాబు మీసకట్టుపై నమ్రత ఆసక్తికర కామెంట్స్..

Mahesh Babu-Namrata: మహేష్ బాబు మీసకట్టుపై నమ్రత ఆసక్తికర కామెంట్స్..

మహేష్ బాబు మీసకట్టుపై నమ్రత ఆసక్తికర కామెంట్స్ (Instagram/Photo)

మహేష్ బాబు మీసకట్టుపై నమ్రత ఆసక్తికర కామెంట్స్ (Instagram/Photo)

Mahesh Babu-Namrata | తాజాగా మహేష్ బాబు ఓ యాడ్ కోసం మీసకట్టుతో కనిపించి అభిమానులను అలరించాడు. ఈ సందర్భంగా మహేష్ మీసకట్టుపై నమ్రత ఆసక్తికర కామెంట్స్ చేసింది.

  Mahesh Babu-Namrata | సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ యేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా  ప్రకటించాడు. ఈ సినిమాను నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ను అమెరికాలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రీ ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. రీసెంట్‌గా ఓ యాడ్‌లో మహేష్ బాబు అలానే మీసకట్టుతో కనిపించాడు. ఫ్లిప్‌కార్ట్‌‌కు సంబంధించిన ఈ యాడ్‌లో మహేష్ బాబు మీసకట్టులో అదరగొట్టేశాడు. మరోవైపు యంగ్‌లుక్‌లో కుర్రాళ్లు  సైతం కుళ్లుకునేలా మహేష్ బాబు సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నాడు. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ యాడ్ గురించి మహేష్ బాబు సతీమణి నమ్రత.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కామెంట్ చేశారు.


  కృతకంగా అమర్చేవి ఎపుడు నేచురల్‌గా కనిపించవు అంటూ మహేష్ బాబు మీసకట్టుపై కామెంట్ చేసింది. వాటితో షూట్ చేయాల్సి వస్తే.. అంత సౌకర్యవంతంగా ఉండదు అంటూ సరదగా కామెంట్ చేసింది. అయితే.. ఈ మేకప్ కోసం సరైనా నిపుణులు ఉంటే ఎలాంటి సవాళ్లను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు అని నమ్రత కామెంట్ చేస్తూ.. మహేష్ బాబుకు మేకప్ చేస్తోన్న ఫోటోను అభిమానులతో షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mahesh babu, Namrata, Sarkaru vaari pata, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు