ఓరి దేవుడా.. థ‌మ‌న్ అప్పుడే 100 సినిమాలు పూర్తి చేసాడా..?

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. 100 సినిమాలు పూర్తయ్యాయా లేదా అనేది కావాలి. ఇప్పుడు థమన్‌ను చూస్తుంటే పోకిరి సినిమాలోని ఈ డైలాగ్ కాస్త మార్చి చెప్పాలనిపిస్తుంది. పదేళ్లు కూడా కాలేదు అప్పుడే 100 సినిమాల మైలురాయి అందుకున్నాడు థమన్. ఆయన కంటే ముందు వచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ ఇంకా 80 ల్లోనే ఉంటే ఈయన మాత్రం అప్పుడే సెంచరీ కొట్టేసాడు. అసలు పడినా లేచినా థమన్ 100 సినిమాల ప్రయాణం మాత్రం అద్భుతమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 1, 2018, 10:55 PM IST
ఓరి దేవుడా.. థ‌మ‌న్ అప్పుడే 100 సినిమాలు పూర్తి చేసాడా..?
థమన్ ఫేస్ బుక్ ఫోటో
  • Share this:
ఏంటి థ‌మ‌న్ 100 సినిమాలు పూర్తి చేసాడా..? అంత లేదు.. మ‌రోసారి లెక్క చూడండి.. క‌చ్చితంగా త‌క్కువ‌గా ఉంటుంది అనుకుంటున్నారా..? అదేం కాదు.. లెక్క తేల్చ‌డానికి థ‌మ‌న్‌కు కూడా కొన్ని రోజులు ప‌ట్టింది. అందుకే ఇప్పుడు త‌న సినిమాల సంఖ్య 100 అయిపోయింద‌ని ఇప్పుడు ట్వీట్ చేసాడు థ‌మ‌న్. ఈయ‌న వందో సినిమా "అర‌వింద స‌మేత" అని తేలింది. ఇదే విష‌యాన్ని ఇప్పుడు థ‌మ‌న్ కూడా చెప్పాడు. ట్విట్ట‌ర్‌లో త‌న 100వ సినిమా గురించి రాసుకొచ్చాడు థ‌మ‌న్.

SS Thaman Completed 100 movies with Aravinda Sametha Veera Raghava.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. 100 సినిమాలు పూర్తయ్యాయా లేదా అనేది కావాలి. ఇప్పుడు థమన్‌ను చూస్తుంటే పోకిరి సినిమాలోని ఈ డైలాగ్ కాస్త మార్చి చెప్పాలనిపిస్తుంది. పదేళ్లు కూడా కాలేదు అప్పుడే 100 సినిమాల మైలురాయి అందుకున్నాడు థమన్. ఆయన కంటే ముందు వచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ ఇంకా 80 ల్లోనే ఉంటే ఈయన మాత్రం అప్పుడే సెంచరీ కొట్టేసాడు. అసలు పడినా లేచినా థమన్ 100 సినిమాల ప్రయాణం మాత్రం అద్భుతమే. థమన్,థమన్ 100 సినిమాలు,పదేళ్లలో 100 సినిమాలు చేసిన థమన్, 100 సినిమాలు పూర్తి చేసిన థమన్,అరవింద సమేతతో థమన్ 100 సినిమాలు,థమన్ 100వ సినిమా అరవింద సమేత,కిక్,ఎస్ఎస్ థమన్,ss thaman,thaman 100 movies completed,thaman 100th movie aravinda sametha,ntr,trivikram,thaman 100 movies in 10 years,kick
థమన్ ఫేస్ బుక్ ఫోటో

ప‌దేళ్ళ గ్యాప్‌లోనే 100 సినిమాలు పూర్తి చేయ‌డం అనేది చిన్న విష‌యం కాదు. తెలుగులో మ‌ణిశ‌ర్మకు కాకుండా ఈ మ‌ధ్య కాలంలో 100 సినిమాలు పూర్తి చేసిన సంగీత ద‌ర్శ‌కుడు మ‌రొక‌రు లేరు. అన్ని భాష‌ల్లోనూ థ‌మ‌న్ సంచ‌ల‌నాలు సాగాయి. తెలుగులో "కిక్" సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు థ‌మ‌న్. ఆ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన త‌ర్వాత కొంత కాలంలోనే స్టార్ హీరోలంద‌రితోనూ ప‌ని చేసాడు. ముఖ్యంగా కెరీర్ మొద‌ట్లో "బృందావ‌నం".. "దూకుడు".. "బిజినెస్‌మ్యాన్" లాంటి సినిమాల‌కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు థ‌మ‌న్. ఆ త‌ర్వాత కాస్త రేస్‌లో వెన‌క‌బ‌డినా కూడా వెంట‌నే మ‌ళ్లీ స్టార్ హీరోల సినిమాల‌తో దూసుకొచ్చాడు.

SS Thaman Completed 100 movies with Aravinda Sametha Veera Raghava.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. 100 సినిమాలు పూర్తయ్యాయా లేదా అనేది కావాలి. ఇప్పుడు థమన్‌ను చూస్తుంటే పోకిరి సినిమాలోని ఈ డైలాగ్ కాస్త మార్చి చెప్పాలనిపిస్తుంది. పదేళ్లు కూడా కాలేదు అప్పుడే 100 సినిమాల మైలురాయి అందుకున్నాడు థమన్. ఆయన కంటే ముందు వచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ ఇంకా 80 ల్లోనే ఉంటే ఈయన మాత్రం అప్పుడే సెంచరీ కొట్టేసాడు. అసలు పడినా లేచినా థమన్ 100 సినిమాల ప్రయాణం మాత్రం అద్భుతమే. థమన్,థమన్ 100 సినిమాలు,పదేళ్లలో 100 సినిమాలు చేసిన థమన్, 100 సినిమాలు పూర్తి చేసిన థమన్,అరవింద సమేతతో థమన్ 100 సినిమాలు,థమన్ 100వ సినిమా అరవింద సమేత,కిక్,ఎస్ఎస్ థమన్,ss thaman,thaman 100 movies completed,thaman 100th movie aravinda sametha,ntr,trivikram,thaman 100 movies in 10 years,kick
థమన్ ఫేస్ బుక్ ఫోటో
థ‌మ‌న్ 50వ సినిమా "ఆగ‌డు".. అది ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు 100వ సినిమా "అర‌వింద స‌మేత‌"తో మాత్రం ప‌ర్లేద‌నిపించాడు. ఈ చిత్రం థ‌మ‌న్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లా మారిపోయింది. స్టార్ హీరోలు న‌మ్మ‌డం మానేసిన స‌మ‌యంలో వ‌చ్చిన "అర‌వింద స‌మేత‌"తో తానున్నాన‌ని గుర్తు చేసాడు థ‌మ‌న్. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాల‌, హిందీ భాష‌ల్లోనూ త‌న మ్యూజిక్ మ్యాజిక్ చూపించాడు థ‌మ‌న్. మొత్తానికి ఇంత త‌క్కువ టైమ్‌లో 100 సినిమాల మైలురాయి అందుకోవ‌డం మాత్రం చిన్న విష‌యం కాదు. అది ఒక్క థ‌మ‌న్‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది.
First published: November 1, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading