‘బాహుబలి’ తో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు దర్శక ధీరుడుఎస్ ఎస్ రాజమౌళి. ఆ సిినిమాతోనే ప్రభాస్ స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు అభిమానులు పెరిగిపోయారు. ఎంత చెప్పుకున్న బాహుబలి సినిమా కోసం ఏదో ఒక కొత్త న్యూస్ వస్తూనే ఉంటుంది. తాజాగా ప్రభాస్‌కు చెందిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు దర్శకుడు రాజమౌళి.బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ భారీకాయంతో కనిపించేందుకు చాలా కష్టపడ్డాడన్నారు. కొన్నాళ్లు విపరీతంగా తింటూ... ఇంకాన్నాళ్లు డైట్ పాటిస్తూ రానా, ప్రభాస్ కష్టపడ్డారన్నారు.
బాహుబలి1, బాహుబలి 2 రెండు భాగాల్లో ప్రభాస్, రానాల దేహ దారుఢ్యాన్ని, భారీకాయాల్ని చూసి జనం షాక్ అయ్యారు. రాజుల కాలంలో జనం ఎలా ఉండేవాళ్లో నిజంగా ఆ రేంజ్‌లోనే చూపించారు రాజమౌళి. ప్రభాస్ నెలలో ఒక్కరోజు తన ఇంటినుంచి 15 రకాల బిర్యానీలను తెప్పించుకొని లాగించేసేవాడని తెలిపారు రాజమౌళి. టేబుల్‌పై రకరకాల బిర్యానీలు, ఫిస్ కర్రీలు, వేపుళ్లు అన్ని ఉండేవి. అయితే అన్నీ రకాలు ఉన్నా కూడా.. ప్రభాస్‌కు మాత్రం అవి సరిపోయేవి కాదు. ప్రభాస్ బావమరిది తన కోస దాదాపుగా అన్నిరకాల బిర్యానీలను ఫిల్మ్‌సిటీకి తీసుకొచ్చేవారన్నారు. ఇంటి ఎన్ని వెరైటీలా అని అతడ్ని రాజమౌళి ప్రశ్నించారు. దీనికి ప్రభాస్ బావమరిది చెప్పిన సమాధానంతో రాజమౌళి షాక్ తిన్నారు. ఇన్ని వెరయిటీలు చేసినా ప్రభాస్ మరొకటేది తక్కువయింది అని అంటాడన్నారు. ప్రభాస్ తెల్లవారు జామునే వాలీబాల్ ఆడి భోజనానికి వచ్చాడు.
అప్పటికే బావమరిది బిరియానీలు తీసుకొచ్చాడు. దాదాపు అన్నిరకాల నాన్ వెజ్ టేబుల్‌పై ఉన్నాయి. దాదాపు 15 రకాల బిరియానీలు ఉంటే వాటిని చూసిన ప్రభాస్... నెయ్యి తొక్కు పచ్చడి లేదా బావా అనడిగేశాడు. దీంతో ప్రభాస్ అలా అనగానే అతని బావమరిది తనవైపు చూశాడని రాజమౌళి తెలిపారు. తెల్లవారు జామున రామోజీ ఫిల్మ్ సిటీనుంచి ఇంటికి వెళ్లి, తన భార్యను అంత పొద్దున్నే లేపి ప్రభాస్ అడిగిన నెయ్యి తొక్కు పచ్చడి చేయించి తీసుకుని వచ్చాడు. దాన్ని తిన్న తర్వాతే ప్రభాస్ మిగతా వాటి జోలికి వెళ్లేవాడు. ఎన్నిరకాల బిర్యానీలు ఉన్నా కూడా తొక్కుపచ్చడి లేకుండా ప్రభాస్ తిండి ప్రారంభించేవాడు కాదన్నారు రాజమౌళి. యునైటెడ్ కింగ్డమ్ లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఇటీవల పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ ప్రభాస్‌కు చెందిన ఈ ఫన్నీ విషయాల్ని అందరితో పంచుకున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:October 23, 2019, 17:03 IST