సైరా నరసింహా రెడ్డిపై రాజమౌళి ట్వీట్.. చిరంజీవి చంపేసాడంతే..

దేశమంతా ఇప్పుడు సైరా మేనియా నడుస్తుంది. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం కోసం మెగాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా బాగానే వేచి చూసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 2, 2019, 4:17 PM IST
సైరా నరసింహా రెడ్డిపై రాజమౌళి ట్వీట్.. చిరంజీవి చంపేసాడంతే..
సైరాపై రివ్యూ రాసిన రాజమౌళి
  • Share this:
దేశమంతా ఇప్పుడు సైరా మేనియా నడుస్తుంది. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం కోసం మెగాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా బాగానే వేచి చూసారు. ఇప్పుడు వాళ్లంతా సినిమా చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా సైరా కోసం బాగానే వెయిట్ చేసారు. తెలుగు సినిమా స్థాయిని పదింతలు పెంచిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు సైరా చూసి తన రివ్యూ పోస్ట్ చేసాడు. ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సైరా చూసిన తర్వాత ప్రశంసల వర్షం కురిపించాడు జక్కన్న.


ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి గారి నటన అద్భుతం.. అమోఘం అంటూ ట్వీట్ చేసాడు రాజమౌళి. ఆ పాత్రకు ఆయన జీవం పోసాడని ప్రశంసించాడు. చరిత్ర మరిచిన వీరుడి కథను మళ్లీ గుర్తు చేసాడు చిరు. ఆయన నటనతో మంటపుట్టించాడు.

ఇక జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా అంతా అద్భుతంగా నటించారు. రామ్ చరణ్, సురేందర్ రెడ్డికి కూడా కంగ్రాట్స్ చెప్పాడు దర్శకధీరుడు. మొత్తానికి సైరాకు వచ్చిన రివ్యూస్ చూసి మెగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.

First published: October 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు