సైరా ప్రీ రిలీజ్ వేడుకకు అతిథులు వీళ్లే.. పవన్ కల్యాణ్, రాజమౌళితో సహా..

సైరా సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్‌టైనర్ సైరా నరసింహారెడ్డి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 22, 2019, 5:43 PM IST
సైరా ప్రీ రిలీజ్ వేడుకకు అతిథులు వీళ్లే.. పవన్ కల్యాణ్, రాజమౌళితో సహా..
‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి (Twitter/Photo)
  • Share this:
సైరా సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్‌టైనర్ సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో కూడా జోరు పెంచేస్తున్నారు టీం. ఇందులో భాగంగానే చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగబోతుంది. సెప్టెంబర్ 22న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది.

Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie audio release date confirmed and Pawan Kalyan as Chief guest pk సైరా సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్‌టైనర్ సైరా నరసింహారెడ్డి. sye raa,sye raa twitter,sye raa instagram,sye raa movie audio release,sye raa audio event,sye raa movie release date,sye raa pawan kalyan,sye raa chiranjeevi,telugu cinema,sye raa audio sept 18,సైరా,సైరా చిరంజీవి,సైరా పవన్ కల్యాణ్,చిరంజీవి పవన్ కల్యాణ్,సైరా ఆడియో రిలీజ్ డేట్ తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)

దీనికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ రానున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ కూడా బాబాయ్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపించాడు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీనికి మెగా కుటుంబ సభ్యులు అంతా హాజరు కాబోతున్నారు. వరుణ్ తేజ్, బన్నీ, సాయి తేజ్, శిరీష్ లాంటి హీరోలంతా ఈ వేడుకకు వస్తున్నారు. వాళ్ళతో పాటు దర్శకులు వినాయక్, రాజమౌళి, కొరటాల శివ కూడా వస్తున్నారు. చిరు తర్వాతి సినిమా కొరటాలతోనే చేస్తున్నాడు. రాజమౌళితో రామ్ చరణ్ ఇప్పుడు చేస్తున్నాడు. ఇక వినాయక్ ఎప్పుడూ మెగా కుటుంబానికి కావాల్సిన వాడే.

Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie audio release date confirmed and Pawan Kalyan as Chief guest pk సైరా సినిమాపై ఇప్పుడున్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటూ వస్తున్న పీరియాడికల్ విజువల్ ఎంటర్‌టైనర్ సైరా నరసింహారెడ్డి. sye raa,sye raa twitter,sye raa instagram,sye raa movie audio release,sye raa audio event,sye raa movie release date,sye raa pawan kalyan,sye raa chiranjeevi,telugu cinema,sye raa audio sept 18,సైరా,సైరా చిరంజీవి,సైరా పవన్ కల్యాణ్,చిరంజీవి పవన్ కల్యాణ్,సైరా ఆడియో రిలీజ్ డేట్
సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు అద్భుత నటన (Source: Youtube)


ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్లతో నిర్మిస్తున్నాడు. కచ్చితంగా ఈ చిత్రంతో చిరంజీవి మరోసారి సంచలనం సృష్టిస్తాడని.. తెలుగు సినిమా రికార్డులను చెరిపేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. అమితాబ్ బచ్చన్ ఒక్కడే వచ్చేలా కనిపించడం లేదు. సినిమాలో నటించిన వాళ్ళంతా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించబోతున్నారు. నయనతార కూడా ఈ వేడుకకు రానుందని తెలుస్తుంది.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading