news18-telugu
Updated: September 8, 2019, 2:42 PM IST
ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్
సైరా సినిమా కోసం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. సినిమా మొత్తం పూర్తయిపోయాక ఇప్పుడు రాజమౌళి ఎంట్రీ ఇచ్చి ఏం చేస్తారనుకుంటున్నారా? చేయొచ్చు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంటుంది. అందులో రాజమౌళి తన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారట. సినిమాకు సంబంధించి ఎడిటింగ్ విషయంలో రాజమౌళి సూచనలు ఇస్తున్నట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను నిర్మిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. బ్రిటిష్ వారిపై తొలిసారి పోరాడిన తెలుగు ధీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

సైరా పోస్టర్ (Source: Twitter)
ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మల్టీ స్టారర్ తీసేపనిలో ఉన్నాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలసి RRR సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్ సైరా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తనకోసం ఓ సారి సైరా నరసింహారెడ్డిసినిమాను చూసి మార్పులు ఏమైనా సూచించాల్సిందిగా చెర్రీ కోరడంతో అందులో జక్కన్న చెక్కే పని భుజానికి ఎత్తుకున్నట్టు తెలిసింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
September 8, 2019, 2:36 PM IST