RRR - Raja Mouli: ‘ఆర్ఆర్ఆర్‌’ అప్‌డేట్.. ఇలా షాకిచ్చావేంటి రాజమౌళి?

SS Rajamouli gives new RRR update and shocks everyone

RRR - Raja Mouli: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. సినిమా షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందనే దాని గురించి ఆసక్తికరమైన అప్‌డేట్...

  • Share this:
    ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళికి ఉన్న ముద్దు పేరు జ‌క్క‌న్న‌.. ఇది అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న్ని జ‌క్క‌న్న అని ఎందుకు పిలుస్తారో కూడా చాలా మందికి తెలిసిందే. ఔట్‌పుట్ విష‌యంలో అస‌లు కాంప్ర‌మైజ్ కాడు. సినిమా చేయాలంటే సంవ‌త్స‌రాల స‌మ‌యం తీసేసుకుంటాడు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసినా.. ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. అందుకు కార‌ణం.. ఆయ‌న సాధించిన భారీ విజ‌యాలే. ఇప్పుడు ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం)‌’ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌ధ్య కోవిడ్ ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈ సినిమా మ‌న ముందుకు వ‌చ్చేసేది. కానీ కరోనా వ‌ల్ల సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. ఇప్పుడు సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని అంద‌రూ అంటున్నారు కానీ.. ఎప్పుడు చిత్రీక‌ర‌ణ ముగుస్తుంది అనే దానిపై రాజ‌మౌళి ఎక్క‌డా, ఎప్పుడూ క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు వ‌చ్చే ఏడాదికి ‘ఆర్ఆర్ఆర్‌’ షూటింగ్‌ను రాజమౌళి ప్యాచ్ వ‌ర్క్‌తో స‌హా పూర్తి చేస్తాడ‌ట‌. ఆ త‌ర్వాతే హీరోలు మరో సినిమాలో న‌టించ‌వ‌చ్చు.

    అంటే ఇప్ప‌టికే రాజ‌మౌళి..ఎన్టీఆర్‌ను ఎప్పుడు వ‌దులుతాడా? అని త్రివిక్ర‌మ్ కాచుకుని కూర్చుని ఉన్నాడు. మ‌రో వైపు చ‌ర‌ణ్‌కూడా నెక్ట్స్ మూవీ విష‌యంలో ఏ క్లారిటీ తీసుకోవ‌డం లేదు. కానీ మ‌ధ్య‌లో చ‌ర‌ణ్ మాత్రం ఆచార్య సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఈ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత ఆరు నెల‌ల గ్యాప్‌లో సీజీ వ‌ర్క్‌ను పూర్తి చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట రాజ‌మౌళి ఆ లెక్క‌లో చూస్తే అక్టోబ‌ర్ నాటికి సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. మ‌రి అక్టోబ‌ర్ నాటికి విడుద‌ల చేస్తాడో లేక‌పోతే.. ఎందుకొచ్చిన గొడ‌వ అని 2022లో ‘ఆర్ఆర్ఆర్‌’ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాడో తెలియాలంటే కొన్నిరోజులు ఆగ‌క త‌ప్ప‌దు.

    News18 Telugu - ‘ఆర్ఆర్ఆర్‌’ అప్‌డేట్.. ఇలా షాకిచ్చావేంటి రాజమౌళి?, SS Rajamouli gives new RRR update and shocks everyone
    SS Rajamouli gives new RRR update and shocks everyone


    ‘ఆర్ఆర్ఆర్‌’.. ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుంటే.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ ఇద్ద‌రు వీరులు క‌లిసి చేసిన ట్రావెల్ గురించే ఈ సినిమా ఉంటుంది. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌తో పాటు కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కూడా నటిస్తున్నాడు. అలాగే ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి.. హాలీవుడ్ స్టార్స్ కూడా న‌టిస్తున్నారు.
    Published by:Anil
    First published: