• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SS RAJAMOULI AND SUPERSTRA MAHESH BABU MOVIE TO BE IN A NEVER SEEN BEFORE BACKDROP MHN

Super Star Mahesh - Rajamouli: సూపర్‌స్టార్ మ‌హేశ్‌, రాజ‌మౌళి సినిమా.. తెలుగు సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రాని బ్యాక్‌డ్రాప్

Super Star Mahesh - Rajamouli: సూపర్‌స్టార్ మ‌హేశ్‌, రాజ‌మౌళి సినిమా.. తెలుగు సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రాని బ్యాక్‌డ్రాప్

SS Rajamouli and Superstra Mahesh Babu movie to be in a never seen before backdrop

Super Star Mahesh - Rajamouli: సూపర్‌స్టార్ మహేశ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రం కోసం రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రానటువంటి బ్యాక్‌డ్రాప్‌తో కథను సిద్ధం చేస్తున్నాడట. ఆ వివరాలు మీకోసం...

  • Share this:
    మ‌హేష్‌తో రాజ‌మౌళి సినిమా..! ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఈ కాంబినేష‌న్ ఉంటుందా? ఉండ‌దా? అనే అనుమానాల‌ను కూడా ఓ ద‌శ‌లో వ్య‌క్తం చేసిన వాళ్లు లేక‌పోలేదు. ఒక‌వేళ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు అని అనుకున్న‌వారూ ఉన్నారు. స‌ర్కారు వారి పాట త‌ర్వాత మ‌హేష్ క‌చ్చితంగా రాజ‌మౌళి సినిమా సెట్‌లోనే ల్యాండ్ అవుతార‌నే న‌మ్మ‌కం ఏంట‌న్న‌ది మ‌రికొంద‌రికి వ‌చ్చిన డౌట్స్. టైమ్ ఎప్పుడు ఎక్క‌డ అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టేస్తే... స్టోరీ ఔట్‌లైన్ విష‌యంలో మాత్రం ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ లీక‌యింది. రాజ‌మౌళి - మ‌హేష్ చేయ‌బోయే ఆ సినిమా క‌చ్చితంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అన‌డంలో ఎలాంటి అనుమామూ లేదు.

    అయితే ఆ ప్యాన్ ఇండియా స‌బ్జెక్ట్ లోనూ ఈ సారి కంప్లీట్లీ డిఫ‌రెంట్ ప్లాట్‌ని ఎంపిక చేసుకున్నార‌ట‌. అది కూడా ఆఫ్రిక‌న్ ఫారెస్ట్ లో జ‌రుగుతుంద‌నట ఈ క‌థ‌. జంగిల్ బేస్డ్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ సినిమాగా తెర‌కెక్కించడానికి అన్నీ స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. దీనికి సంబంధించి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే రీసెర్చ్ వ‌ర్క్ మొత్తం పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. ఇండియ‌న్ సెల్యులాయిడ్ మీద ఇప్ప‌టిదాకా ఎవ్వ‌రూ చూడ‌ని విజువ‌ల్స్ ని ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్‌. వీఎఫ్ ఎక్స్ కి ఎక్స్ ట్రీమ్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాగా రూపొందించాల‌న్న‌ది మేక‌ర్స్ టార్గెట్‌. యాక్ష‌న్‌, థ్రిల్స్, డ్రామా కూడా అదే స్థాయిలో ఉన్నాయ‌ట‌. ప్ర‌పంచ‌లోని ప‌లు ఇంటెన్స్ ఫారెస్ట్ లొకేష‌న్స్ లో తెర‌కెక్కించాల‌న్న‌ది రాజ‌మౌళి ఐడియా.

    ప్ర‌స్తుతం రాజ‌మౌళి, విజ‌యేంద్ర ప్ర‌సాద్ సినిమా స్క్రిప్ట్‌పై వ‌ర్క్ చేస్తున్నారు. ఇంకా సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియ‌డం లేదు కానీ... వ‌చ్చే ఏడాది (2022) చివ‌ర‌లో సినిమా స్టార్ట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కించేలా ద‌ర్శ‌క‌ధీరుడు ప్లాన్ చేశాడు. కె.ఎల్‌.నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు